Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుణాచలం దర్శకత్వంలో నాగ శౌర్య కొత్త సినిమా

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (15:24 IST)
Naga Shaurya
హీరో నాగ శౌర్య ఇటీవల తన తదుపరి సినిమాలు ఒకదానికొకటి భిన్నంగా, కమర్షియల్ గా విజయాలు అందుకునే చిత్రాలుగా ఉంటాయని ప్రకటించారు. ఈరోజు ఆయన 24వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. #NS24 చిత్రానికి ఎస్ఎస్ అరుణాచలం దర్శకత్వం వహించనున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా నాగశౌర్యకు పర్ఫెక్ట్ యాప్ట్ స్క్రిప్ట్.
 
వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం 1 గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. బేబీ అద్వైత, భవిష్య ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. 
 
దర్శకుడు ఎస్‌ఎస్‌ అరుణాచలం స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం త్వరలో గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. కొందరు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు.
 
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో  తెలియజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments