Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ కోసం కన్నీరు పెట్టుకున్న నాగ చైతన్య.. ఏ అమ్మకోసం.. ఎందుకోసం?

''ప్రేమ‌మ్'' సినిమాతో హీరోగా సూప‌ర్ స‌క్సెస్ సాధించాడు యంగ్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మంచి హిట్ అయిన ''ప్రేమ‌మ్'' ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ పొందుతోంది. అక్కినేని నాగార

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (13:12 IST)
''ప్రేమ‌మ్'' సినిమాతో హీరోగా సూప‌ర్ స‌క్సెస్ సాధించాడు యంగ్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మంచి హిట్ అయిన ''ప్రేమ‌మ్'' ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ పొందుతోంది. అక్కినేని నాగార్జున వారసుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన చైతూ... ఒక ఛానెల్‌కి ఇస్తున్న ఇంటర్వ్యూలో తన తల్లి గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నాడు.
 
తనకి తన అమ్మ అంటే ఎంతో భయమని, కానీ ఆమె అంటే చాలా ఇష్టమని చెప్పిన నాగచైతన్య, తన తల్లి ఏ లోటు లేకుండా తనకి అన్ని సమకూర్చారని అన్నారు. అయితే తన తల్లి గురించి ఇంకా మాట్లాడుతూ ''అమ్మకి అన్ని విషయాలు చెప్పే నేను నా ప్రేమ విషయం గురించి చెప్పడానికి మొదట భయపడ్డానని అయితే మాటల మధ్యలో ఒకసారి చెప్పానని దానికి అమ్మ ఒప్పుకుందని'' నాగచైతన్య అన్నారు.
 
నా జీవితంలో అమ్మ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. అంతేకాదు తనకి అమ్మ అన్ని విధాలుగా సహాయంగా ఉన్నారని చైతూ వెల్లడించాడు. మా అమ్మ ఏడిస్తే నేను తట్టుకోలేనని ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. ఇంతకీ  ఏ అమ్మో.. ఆ అమ్మ పేరును మాత్రం చైతూ వెల్లడించలేదు. నాగార్జున మొదటి భార్య కుమారుడు నాగ చైతన్య.  కానీ కుటుంబ కలహాల కారణంగా నాగార్జున ఆమెతో సంబంధాలు తెంచుకుని హీరోయిన్ అమలను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments