Naga chaitanya Sobhita dhulipala Wedding, అక్కినేని నాగచైతన్య- శోభిత ధూళిపాళ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈరోజు డిశెంబరు 4వ తేదీ రాత్రి 08:13 గంటలకు శోభిత మెడలో నాగచైతన్య మూడుముళ్లు వేసాడు. అత్యంత సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుకలు జరిగాయి. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవలే హల్దీ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.