ఏ మాయ చేశావె చిత్రం ద్వారా ప్రేమలో పడి... మనంతో మరింత దగ్గరై... చివరికి పెళ్ళికి రెడీ అవుతున్నారు నాగ చైతన్య, సమంత. వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని స్వయంగా నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున వెల్లడించారు. సమంత తన కాబోయే కోడలు అని నలుగురికి పరిచయం కూడా చేశారు. రేపో, మాపో వారిద్దరి పెల్ళి బాజా మోగుతుంది.
అయితే, వారిద్దరి జాతకాలు, గ్రహాలు మాత్రం పెళ్ళికి కలిసిరావట్లేదని ప్రముఖ జ్యోతిష్యులు పేర్కొంటున్నారు. నాగచైతన్యది ఆశ్లేష నక్షత్రం, సమంతది భరణి నక్షత్రం. వారిద్దరికీ త్వరలోనే వివాహం అవుతుంది. కానీ, పెళ్ళి తర్వాత కుజ దోషం, కాల సర్ప దోషం వల్ల వారి వైవాహిక జీవితంలో సమస్య ఉంటుందని జాతకాలు విశ్లేషిస్తున్నారు. అయినా, ఇద్దరూ సెలబ్రిటీలు... ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి మండపం వరకు చేరిన తర్వాత... వారి వివాహ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకూడదని అభిమానులు ఆశిస్తున్నారు.