Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేలిపోయింది.. తెగిపోయింది.. సమంత-చైతూ విడాకులు కన్ఫామ్

Naga Chaitanya
Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (15:59 IST)
టాలీవుడ్ సెలబ్రిటీ జంట సమంత, అక్కినేని నాగచైతన్య విడాకులకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు విడాకులు తీసుకునేందుకు ఈ జంట సిద్ధంగా వున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తలను నిజం చేసేలా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో అసలు విషయం బయటపెట్టింది. భార్యాభర్తలుగా వున్న తాము వేర్వేరు మార్గాల వైపు వెళ్తున్నట్లు ప్రకటించింది. ఇలా విడాకుల తీసుకునే చైతూ-సమంత నిర్ణయం ఇటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు అటు సినీ అభిమానుల మధ్య చర్చనీయాంశమయ్యింది.   
 
మొన్నటికి మొన్న చైతూ లేకుండా తన ఫ్రెండ్స్‌తో కలిసి గోవాకు వెళ్లిన సామ్.. వారితో కలిసి అక్కడ తెగ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత రెండు మాసాలగా చైతూ ఫోటోలు ఏవీ సమంత షేర్ చేయకపోవడం.. మొన్నటికి మొన్న చైతూ లేకుండా ఫ్రెండ్స్‌తో కలిసి సమంత గోవా ట్రిప్‌కు వెళ్లడంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందన్న వార్తలకు మరింత ఊతమిచ్చింది. 
 
ఇటీవల అక్కినేని నాగార్జున బర్త్ డే వేడుకలకు సమంత హాజరుకాకపోవడానికి కారణం ఇదేనని మీడియా వర్గాలు తేల్చేశాయి. అయితే దీనిపై ఇటు సమంత, అటు చైతూ లేదా నాగార్జున ఫ్యామిలీ నుంచి ఎవరూ ఇప్పటి వరకు స్పందించలేదు. మొన్న ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో రిస్ట్రిక్షన్‌లో ఉండటం తనకు ఇష్టముండదని సమంత చేసిన వ్యాఖ్యలు ఆసక్తిరేకెత్తించాయి. అక్కినేని ఫ్యామిలీపైనే సమంత ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఆప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
Samantha Akkineni
 
ఈ వార్తలను నిజం చేసేలా ఇన్‌స్టాగ్రామ్‌లో విడాకులపై స్పందించింది. "నేను చై విడాకులు తీసుకునే నిర్ణయానికి వచ్చాం. అయితే మా మధ్య స్నేహం కొనసాగుతుంది. మా ఇద్దరి మధ్య బంధం ప్రత్యేకం. పదేళ్ల పాటు మా బంధం కొనసాగిందని చెప్పుకొచ్చింది. అంతేగాకుండా తమ అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా ప్రతినిధులు తమకు మద్దతివ్వాలని.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రైవసీ కోరుకుంటున్నామని సమంత తెలిసింది. ఇంకా తనకు మద్దతిచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments