Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ చైతన్య తండేల్ యాక్షన్ పార్ట్ షెడ్యూల్‌ ప్రారంభం

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2023 (15:31 IST)
Tandel- chitu
నాగ చైతన్య,  సాయి పల్లవి నటిసున్న చిత్రం  'తండేల్'. డైరెక్టర్ చందూ మొండేటి, గీతా ఆర్ట్స్ క్రేజీ కాంబినేషన్‌లో  'తండేల్' రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ఉడిపిలో ప్రారంభమైంది. అల్లు అరవింద్ సమర్పణలో నిర్మాత బన్నీ వాసు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్నిస్తున్నారు.  
 
షూటింగ్ జరుగుతున్న ఈ లెన్తీ షెడ్యూల్‌లో టీమ్ కొన్ని కీలకమైన సన్నివేశాలు, యాక్షన్ పార్ట్స్ ని షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం సముద్రం మధ్యలో అడ్రినలిన్ పంపింగ్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. టీమ్ షేర్ చేసిన ఫోటోలో నాగ చైతన్య సముద్రం వైపు నడుస్తూ ఆనందంగా కనిపిస్తున్నారు. మేకర్స్ త్వరలో కొన్ని ఎక్సయిటింగ్ అప్‌డేట్‌లతో రానున్నారు.
 
కంప్లీట్ మేకోవర్‌ అయిన నాగ చైతన్య ఈ సినిమాలో మునుపెన్నడూ లేని గెటప్‌లో కనిపించనున్నారు. షూట్ ప్రారంభించడానికి ముందు ఇంటెన్స్ ట్రైనింగ్, హోంవర్క్ చేశారు.
 
యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. తండేల్ పూర్తిగా భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమకథ.
 
కథలో సంగీతానికి మంచి స్కోప్ ఉన్నందున, జాతీయ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన సౌండ్‌ట్రాక్‌లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రేమకథను అందంగా తీర్చిదిద్దుతున్నారు. విజువల్ వండర్ ని అందించడానికి షామ్‌దత్ కెమెరామ్యాన్ గా పని చేస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని శ్రీనాగేంద్ర తంగాల పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments