Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాల్ సింగ్ చద్దా నుంచి నాగ చైతన్య లుక్

Webdunia
గురువారం, 21 జులై 2022 (16:11 IST)
Naga Chaitanya look
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లాల్ సింగ్ చద్దా. ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే బాలీవుడ్ లో విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండడం గమనార్హం. 
 
ఇందులో హీరో నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈయన ఫస్ట్ లుక్ మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఇందులో బాలరాజు పాత్రలో నటిస్తున్నారు చైతన్య. అమీర్ ఖాన్ తో కలిసి సైనికుడిగా కనిపిస్తున్నారు అక్కినేని హీరో. ఇప్పటికే ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ దర్శకుడు సుకుమార్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి, కింగ్ నాగార్జున, నాగ చైతన్య కలిసి చూశారు. షో అయిపోయిన తర్వాత అమీర్ ఖాన్ పెర్ఫార్మన్స్ గురించి.. చైతన్య పాత్ర గురించి బాగా ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్. సినిమా ఖచ్చితంగా అద్భుతమైన విజయం సాధిస్తుందని.. తెలుగులో కూడా ప్రేక్షకుల మన్ననులు అందుకుంటున్న అని తెలిపారు చిరంజీవి. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
 
న‌టీన‌టులు - ఆమిర్ ఖాన్, క‌రీనా కుమార్, నాగ చైత‌న్య త‌దిత‌రులు
స‌మ‌ర్ప‌ణ - మెగాస్టార్ చిరంజీవి
బ్యాన‌ర్లు - వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్
నిర్మాత‌లు - ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే
సంగీతం - ప్రీతిమ్
భార‌తీయ చిత్రానుక‌ర‌ణ - అతుల్ కుల్ క‌ర్ణి
ద‌ర్శ‌క‌త్వం - అద్వైత్ చంద‌న్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments