Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగచైతన్యను భలే వాడేసుకుంటున్న సమంత... పర్ఫెక్ట్ కపుల్ అంటే...

ఇదివరకు అమ్మాయిలు అంటే వంటింటి కుందేళ్లు అని అనేసేవారు. కానీ ఆ సామెతను తిరగరాయాలని ఎంతమంది చూసినా పరిస్థితిలో మార్పులేదు. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. అబ్బాయిలు కూడా బ్రహ్మాండంగా వంట చేసి పెడుతున్నారు. ఖాళీ దొరికితే చాలు భర్

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (19:57 IST)
ఇదివరకు అమ్మాయిలు అంటే వంటింటి కుందేళ్లు అని అనేసేవారు. కానీ ఆ సామెతను తిరగరాయాలని ఎంతమంది చూసినా పరిస్థితిలో మార్పులేదు. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. అబ్బాయిలు కూడా బ్రహ్మాండంగా వంట చేసి పెడుతున్నారు. ఖాళీ దొరికితే చాలు భర్తలు కూడా భార్యలకు మంచి పకోడీలు, జంతికలు ఎంచక్కా వండిపెడుతున్నారు. ఇక ఆదివారం వస్తే మా శ్రీవారు ఎంచక్కా మంచి మసాలా చికెన్ వండి పెట్టారని చెప్పుకునే భార్యలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు. 
 
ఇదంతా ఎందుకంటే.. కాబోయే దంపతులు నాగచైతన్య-సమంతలు వీలు చిక్కినప్పుడల్లా చక్కగా వంటింట్లో సందడి చేస్తున్నారు. చైతూ వంట చేస్తూ చక్కగా వడ్డించేస్తున్నాడు. తాజాగా సమంత తన స్నేహితురాళ్లను తీసుకొస్తే... చైతూ తనే వంట వండి వారికి వడ్డించాడు. అంతా లొట్టలు వేసుకుంటూ ఆ స్నాక్స్ లాగించేశారట. దీనిపై సమంత ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ... ''నాకు ఇది ఉంటే.. జీవితంలో అంతా ఉన్నట్లే'' అని ఒక క్యాప్షన్ పెట్టింది. అంతేకాదు.. త‌న‌కు కుటుంబమే సమస్తమని, చైతూ పట్ల తనకు ల‌వ్‌, గౌరవం, కృతజ్ఞత అన్నీ ఉన్నాయని హ్యాష్ ట్యాగ్‌లను జోడించింది. ఎస్... పర్ఫెక్ట్ కపుల్ అంటే అలాగే వుండాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments