అక్కినేని వారింట పెళ్లి సందడి మొదలైంది. శుక్రవారం హీరోయిన్ సమంతతో నాగచైతన్య వివాహం జరుగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం తన కుమారుడు నాగచైతన్యను పెళ్లి కొడుకును చేసిన అనంతరం తీసిన ఫోటోను నాగార్జున అభి
అక్కినేని వారింట పెళ్లి సందడి మొదలైంది. శుక్రవారం హీరోయిన్ సమంతతో నాగచైతన్య వివాహం జరుగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం తన కుమారుడు నాగచైతన్యను పెళ్లి కొడుకును చేసిన అనంతరం తీసిన ఫోటోను నాగార్జున అభిమానులకు షేర్ చేశారు. మధ్యలో పెళ్లికొడుకుగా చైతూ నిలబడగా, అటూ ఇటూ నాగార్జున, వెంకటేష్ నిలబడి ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మెహందీతో వివాహ తంతు మొదలు కానుండగా, రాత్రికి హిందూ సంప్రదాయంలో, శనివారం సాయంత్రం క్రైస్తవ సంప్రదాయంలో చైతూ, సమంతల పెళ్లి గోవాలో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైతూను పెళ్లి కొడుకును చేసిన ఫోటోకు వేలకొద్దీ లైక్స్ వస్తున్నాయి. దీంతో పాటు చైతూ పెళ్లికొడుకైన వేళ తీసిన ఫోటోలను వీడియో ద్వారా చూడండి..