Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

ఠాగూర్
ఆదివారం, 17 నవంబరు 2024 (17:54 IST)
తెలుగు హీరో నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ్లలు త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. వీరి వివాహం డిసెంబరు నాలుగో తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇందులోభాగంగా, పెళ్లి పత్రికను ముద్రించగా, ఆ కార్డు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 
 
టాలీవుడ్ హీరోయిన్ సమంతను నాగ చైతన్య ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత వారిమధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సమంత తన ఆరోగ్యంతో పాటు సినిమాలపై దృష్టిసారించారు. నాగచైతన్య కూడా సినిమాలతో బిజీగా వున్నారు. అయితే నాగచైతన్య మాత్రం మళ్లీ పెళ్లికి సిద్దమయ్యాడు. త్వరలోనే ఆయన కథానాయిక శోభిత ధూళిపాళను వివాహం చేసుకోబోతున్నారు. 
 
గత కొంత కాలం నుంచి స్నేహంగా ఉంటున్న ఈ జంటకు ఇటీవల ఇరువురి కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం కూడా జరిగింది. ఎంగేజ్మెంట్ తర్వాత నాగ చైతన్య - శోభిత జంట ఇటీవల కొన్ని పబ్లిక్ ఫంక్షన్స్‌కు హాజరయ్యారు. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక ఈ జంట వివాహం డిసెంబర్ 4న అంగ రంగ వైభవంగా జరుగనుంది. 
 
ఇందుకోసం హైదరాబాద్ నగరంలోని అన్నపూర్ణ స్టూడియో ముస్తాబవుతుంది. ఇక్కడే ప్రత్యేక పెళ్లి మండపం సెట్ వేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు ఆల్ రెడీ కొంత మంది స్నేహితులకు, బంధుమిత్రులకు వెడ్డింగ్ ఇన్విటేషన్‌లు పంపిస్తున్నారు. అక్కినేని వారి ఇంట ఆల్రెడీ పెళ్లి పనులు, పెళ్లి సందడి మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుకుగా సాగుతున్నాయి. 
 
మరోవైపు, నాగచైతన్య నటిస్తున్న 'తండేల్' చిత్రం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. ఫిబ్రవరి 7న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, బన్నీవాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments