Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా హీరోలేంటి..? మెగా హీరోయిన్ వస్తోంది..? ఎవరో తెలుసా..?

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (16:48 IST)
సాధారణంగా హీరోల కుమార్తెలు సినీ ఇండస్ట్రీకి పరిచయం కావడం అరుదు. నందమూరి హీరోస్, మెగా హీరోస్, అక్కినేని హీరోస్, కృష్ణ ఫ్యామిలీ హీరోస్ ఇలా వంశపార్యంగా హీరోలే తెరంగేట్రం చేస్తారు. అయితే హీరోయిన్లుగా హీరోల కూతుళ్ళు తెరపై కనిపించరు. కానీ సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల మాత్రం వెండితెర ఒకే సినిమాలో కనిపించి.. నిర్మాతగా తెరవెనుక పనులకు తిరిగెళ్లిపోయింది. మంచు కుటుంబం నుంచి మంచు లక్ష్మి సినీ తెరపై కాస్త పేరు తెచ్చుకుంది. 
 
యితే తాజాగా మెగా హీరోలేంటి..? మెగా కుటుంబం నుంచి హీరోయిన్ వచ్చేస్తుంది. ఆమె ఎవరో కాదు.. నాగబాబు కుమార్తె నిహారిక. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. నాగబాబు తన కుమార్తె హీరోయిన్ అయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. 
 
ఇప్పటికే నిహారిక రెండు టీవీ షోల్లో కనిపించింది. ఆడియన్స్ కూడా ఆమెను అస్సెప్ట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు నిహారికను తెరంగేట్రం చేయించేందుకు నిర్మాతలు, దర్శకుల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. నిహారిక నటించడంలో తనకెలాంటి అభ్యంతరం లేదని తేల్చేశారు. ఇప్పటికే నిహారిక స్క్రిప్ట్ వినే పనుల్లో ఉందని అంతా కుదిరితే త్వరలోనే నిహారిక సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సినీ పండితులు అంటున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments