Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున పాత్రని తెలియజేస్తూ నా సామిరంగ అనేలా సాంగ్ చిత్రీకరణ

Webdunia
సోమవారం, 1 జనవరి 2024 (11:49 IST)
Nagarjuna, Allari Naresh, Raj Tarun
నాగార్జున అక్కినేని కొత్త సినిమా ‘నా సామిరంగ’. అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్ నటిస్తున్నారు.  ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెన్ తో ఆసక్తిని రేకెత్తించింది. పోస్టర్‌లు, ఫస్ట్ టీజర్, ఫస్ట్ సింగిల్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి సీజన్‌లో విడుదలకు సన్నాహాలు చేసిన మేకర్స్, జనవరి 14న సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ఈ రోజు అనౌన్స్ చేశారు.
 
సినిమా టైటిల్ సాంగ్-నా సామి రంగ లిరికల్ వీడియో విడుదల చేశారు. ఆస్కార్ అవార్డ్ విజేతల ద్వయం- ఎంఎం కీరవాణి క్యాచీ ట్రాక్‌, చంద్రబోస్ మాస్ లిరిక్స్‌తో ఈ పాట మెస్మరైజ్ చేసింది. ‘మా జోలికొస్తే.. మాకడ్డు వస్తే.. మామూలుగా వుండదు.. నా సామిరంగ.. ఈ గీత తొక్కితే.. మా సేత సిక్కితే.. మాములుగా వుండదు.. నా సామిరంగ’ అనే పదాలు కథానాయకుడి పాత్రని తెలియజేస్తూ మాస్ ని ఆకట్టుకునేలా వున్నాయి.
 
ఈ పాటని కాల భైరవ & రాహుల్ సిప్లిగంజ్ హై ఎనర్జీతో ఆలపించారు. ప్రధాన తారాగణం తో పాటు 300 మంది డ్యాన్సర్స్ తో లావిష్‌గా చిత్రీకరించిన పాటకు దినేష్ మాస్టర్ అందించిన కొరియోగ్రాఫర్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. నాగార్జున తన మాస్ స్వాగ్ తో కట్టిపడేశారు. నాగార్జున, అల్లరి నరేష్ లుంగీలో మాస్ అవతారాల్లో ఆకట్టుకుంటే, రాజ్ తరుణ్ ఫార్మల్స్‌ లో కనిపించారు. నాగార్జునతో కలిసి అల్లరి నరేష్, రాజ్ తరుణ్ డ్యాన్స్ చేయడం కన్నుల పండగలా వుంది.  
 
మంచి ప్రేమకథ, స్నేహం, భావోద్వేగాలు, మాస్ ,యాక్షన్ ఎలిమెంట్స్ కూడిన నా సామిరంగ సంక్రాంతికి పర్ఫెక్ట్  మూవీ అని ప్రోమోలు ప్రామిస్ చేస్తున్నాయి.  
 
నాగార్జున సరసన ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై  బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివేంద్ర దాశరధి సినిమాటోగ్రఫీ అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి టెండర్ల ఖరారు

Bride: పెళ్లి కూతురు పద్ధతిగా వుంటుంది అనుకుంటే.. ఇలా మందేసి, సిగరెట్ కాల్చింది..(video)

వంట సరిగ్గా వండలేదని కొబ్బరి తురుముతో భార్యను హత్య చేసేశాడు.. ఎక్కడ?

Cow attack: ఏపీలో ఆవుల దాడి.. ఒకరు మృతి.. మరొకరికి తీవ్రగాయాలు (video)

Iran: అమెరికాతో చర్చలు.. అవసరమైతే చూద్దాం... సయ్యద్ అబ్బాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments