Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సామిరంగ టైటిల్ సాంగ్ భారీ సెట్ లో షూటింగ్

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2023 (18:59 IST)
Nagarjuna - Ashika Ranganath
నాగార్జున అక్కినేని మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రానికి విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో నా సామిరంగ టైటిల్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేతలు – ఎంఎం కీరవాణి ఫుట్ ట్యాపింగ్ ట్యూన్ కంపోజ్ చేయగా చంద్రబోస్ లిరిక్స్ అందిస్తున్నారు.
 
ఈ మాస్ నంబర్‌లో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా అలరించనున్నారు.  సినిమాకే పెద్ద ఆకర్షణగా నిలవనున్న ఈ పాట చిత్రీకరణలో 300 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారు. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
 
టీజర్‌లో నాగార్జునతో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. టీజర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ముగ్గురిపై పాట థియేటర్స్ లో  అదిరిపోయేలా వుంటుంది.
 
నాగార్జున, ఎంఎం కీరవాణి, చంద్రబోస్‌ల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో మ్యూజిక్ ఆల్బమ్ అన్ని మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ లో వుంది.  
 
నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివేంద్ర దాశరధి సినిమాటోగ్రఫీ అందించారు.
చంద్రబోస్ లిరిక్స్ రాయగా, బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, సంభాషణలు అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments