Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రైమ్ థ్రిల్లర్ ‘ఎన్.ఈ.ఎస్.టి’పై సినీ ప్రముఖుల ప్రశంసలు

ఠాగూర్
గురువారం, 29 ఆగస్టు 2024 (16:45 IST)
యునైటెడ్ స్టేట్స్‌లోని చాలా ప్రదేశాలలో ఎన్.ఇ.ఎస్.టి. (N.E.S.T.) చిత్రాన్ని షూట్ చేశారు. ఇంగ్లీషులో తీసిన ఈ చిత్రాన్ని ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల కోసం డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఫణి శివరాజు, మణి శశాంక్ కొలిశెట్టి, పులి ధరణి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో శరత్ సింగం దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ మూవీని నటుడు అరవింద్ కృష్ణతో సహా పరిశ్రమలోని పలువురు ప్రముఖులకు ప్రత్యేకంగా ప్రీమియర్‌ షోను వేశారు.
 
ప్రీమియర్ షోలో సినిమాను చూసిన సెలెబ్రిటీలు మూవీ మీద ప్రశంసల వర్షం కురిపించారు. చిత్రం చాలా బాగుందని, సినిమాలో ఆడియెన్స్ అంతా లీనమై చూసేలా ఉందని పొగిడేశారు. ఆడియెన్స్ మీద కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని చెప్పుకొచ్చారు.
 
కథ, స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉందని, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో మూవీని తీసినట్టుగా ఉందని చూసిన వారంతా మెచ్చుకున్నారు. ఫణి శివరాజు, సుదీప్ తానేటి సారథ్యంలోని సినిమాటోగ్రఫీ, భరద్వాజ్ వెంకట ఆర్ఆర్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు.
 
తారాగణం: ఫణి శివరాజు, మణి శశాంక్ కొలిశెట్టి, బద్రి కాలేపల్లి, పులి ధరణి, అను రవికుమార్, సంతోషి దామిడి, ప్రసన్న పొన్నాల, సుదీప్ తానేటి, సత్య చలసాని, వినయ్ రెడ్డి కుంట, అభిషేక్ రెడ్డి ఎల్లు, శ్రీపాల్ రెడ్డి, నితిన్ కృష్ణ పులివర్తి, రవికుమార్ పండరి, రవికుమార్ పండరి, , రేణు కాలేపల్లి తదితరులు
 
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శరత్ సింగం
డీవోపీ: ఫణి శివరాజు, సుదీప్ తానేటి
నేపథ్య సంగీతం: భరద్వాజ్ వెంకట
ఎడిటింగ్: కార్తీక్ పల్లె
డీఐ: గణేష్ కొమ్మరపు
పీఆర్వో: సాయి సతీష్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments