33 సంవత్సరాల తర్వాత, నేను T.J జ్ఞానవేల్ దర్శకత్వంలో రాబోయే లైకా యొక్క "తలైవర్ 170"లో నా గురువు, దృగ్విషయం, శ్రీ అమితాబ్ బచ్చన్‌తో కలిసి మళ్లీ పని చేస్తున్నాను. నా గుండె ఆనందంతో కొట్టుకుంటుంది. అని రజని కాంత్ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఇందుకు అభిమానులనుండి మంచి స్పందన లభిస్తోంది.
దీనికి అమితాబ్ స్పందిందిస్తూ, రజినీకాంత్ గారు 33 ఏళ్ల తర్వాత.. ఎంతటి గౌరవం మరియు భారీ ప్రత్యేకత. మరియు మీరు కొంచెం కూడా మారలేదు ఇప్పటికీ గొప్పతనం అంటూ ట్వీట్ చేశారు.
1983లో అందా కానూన్ సినిమాలో రజని, అమితాబ్ కలిసి నటించారు. ఇందులో హేమామాలిని కూడా ఉంది. టి. రామారావు దర్శకత్వంలో రూపొందింది. ఇప్పడు 33 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం ఫాన్స్ కు హ్యాపీగా ఉంది.
తలైవర్ 170 అనేది T. J. జ్ఞానవేల్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. . లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్ మరియు దుషార విజయన్‌లు నటిస్తున్నారు.<>