Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు నచ్చిన సినిమా 18 పేజెస్ ఎందుకంటే ! : అనుపమ పరమేశ్వరన్

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (17:31 IST)
Anupama Parameswaran
జీఏ 2” పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “18 పేజిస్” నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసంబర్ 23న రిలీజ్ అవుతున్న  సందర్బంగా చిత్ర హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ పలు విషయాలు చెప్పారు.
 
- 2020 లాక్ డౌన్ టైమ్ లో డైరెక్టర్ సూర్య ప్రతాప్ గారు ఈ స్టోరీ చెప్పాడు. ఈ కథ విన్నప్పుడే చాలా ఎగ్జైయిటింగ్ అనిపించింది వెంటనే సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను
 
- 18 పేజెస్ సినిమాకు కార్తికేయ సినిమా చేయకముందే సైన్ చేశాను. నిఖిల్ తో ఈ రెండు సినిమాలతో జర్నీ చాలా హ్యాపీగా ఉంది. 18 పేజెస్ సినిమాతో పాటు కార్తికేయ సినిమా కూడా ప్యార్లల్ గా చేశాము. ఆది అడ్వెంచర్ మూవీ అయితే ..ఈ 18 పేజెస్ క్రెజీ లవ్ స్టోరీ.. కార్తికేయ బిగ్ హిట్ అవ్వడంతో మా పెయిర్ కు జనాల్లో మంచి పేరొచ్చింది. ఈ 18 పేజెస్ సినిమా కూడా కార్తికేయ సినిమాలాగే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను.
 
- ఇప్పటి వరకు నేను చేసిన లవ్ స్టోరీస్ లో ఇది మాఫెవరెట్ మూవీ.. 18 పేజెస్ లో నందిని క్యారెక్టర్ చాలా టిఫికల్ గా ఉంటుంది. ప్రస్తుతం అందరూ ఈ క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.ఈ క్యారెక్టర్ మోస్ట్ ఫెవరెట్ క్యారెక్టర్.. దీని గురించి ఎక్కువ చెప్పలేను.. అది సినిమా చూస్తే మీకే తెలుస్తుంది
 
- ప్రేమ లేకుండా ప్రపంంచమే లేదు. అలాగే ఎమోషన్స్ లేకుండా లైఫ్ ఉండదు. కాబట్టి ప్రేమ కథలు కచ్చితంగా ఉండాలి. ఉంటాయి. ఈ సినిమా కూడా ప్యూర్లీ 100% లవ్ స్టోరీ కాబట్టి అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను 
 
- మనకు తెలియకుండా జరిగిన విషయామే లవ్..మనం క్యాలిక్యూలెట్ చేసి చేసేది ఆరెంజ్డ్ లవ్.కాబట్టి ప్రేమించడానికి రీజన్ ఉండదు. ఎందుకు ప్రేమిస్తున్నాను అంటే డానికి ఆన్సర్ ఉండదు అదే డైలాగ్ ఇందులో పెట్టడం జరగింది.
 
- ప్రస్తుతం ఫెస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి షోషల్ మీడియా ట్రెండ్ నడుస్తున్న ఇలాంటి టైమ్ లో మొబైల్ లేకుండా చాలా మంది ఉండలేరు. అయితే సోషల్ మీడియాలో లేకుండా అసలు మొబైల్ లేకుండా ఉండే ఒక ఇన్నోసెంట్ గర్ల్ క్యారెక్టర్ లో నటించాను. ఈ క్యారెక్టర్ నా మనసుకు చాలా దగ్గరనిపించింది ఇలాంటి క్యారెక్టర్ ను డిజైన్ చేసినప్రతాప్ గారికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి .
.
- ఏదైతే సుకుమార్ గారి బ్రెయిన్ చైల్డ్ నుండి క్యారెక్టర్ పుట్టిందో దాన్ని తీర్చి దిద్దేటప్పుడు డైరెక్టర్ ప్రతాప్ గారు అనుకున్న ప్రకారం తను ఏం చెపితే అది చేశాను.సినిమా చాలా బాగా వచ్చింది.
 
- సుకుమార్ గారి రంగస్థలం సినిమాలో నటించే ఛాన్స్ మిస్ అయినపుడు చాలా బాధ పడ్డాను. మళ్ళీ ఇప్పుడు సుకుమార్ గారి రైటింగ్స్ లో నా క్యారెక్టర్ ను డిజైన్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది. అయన రైటింగ్స్ లో ఇది నాకు సిగ్నేచర్ క్యారెక్టర్ అవుతుంది.
 
- అల్లు అరవింద్ గారిని ఎప్పుడు కలసినా నన్ను ఒక కూతురులా చాలా బాగా చూసుకుంటారు.. చాలా సందర్బాలలో తనకు నాలాంటి కూతురు ఉంటే బాగుండు అనడం నాకది పెద్ద బ్లెస్సింగ్ అనుకుంటున్నాను.
 
- ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత ఇంకా చాలా మందికి ఈ పాటలు రీచ్ అవుతాయి..అలాగే ఆ పాటలలోనే కథ ఉంది..
 
- అందరూ నన్ను డైరెక్షన్ గురించి అడుగుతున్నారు..ఈ సినిమాల కమిట్మెంట్స్ అయిపోవాలి. ఆ తరువాత ఇంకా చాలా మంది దర్శకుల దగ్గర నేను టెక్నీకల్ గా ట్రైన్ అయ్యిన తరువాత కచ్చితంగా డైరెక్షన్ చేస్తాను. ఇందులో మాత్రం యాక్ట్ చేయను  
 
- ఈ సినిమా తరువాత రైటర్ లక్ష్మీ భూపాల్ ప్రొడక్షన్ లో మరీచిక, జయం రవి గారితో సైరన్, అలాగే రవితేజ గారితో కార్తీక్ ఘట్టమనేని గారి ఈగల్ సినిమాలో నటిస్తున్నాను. అని ముగించారు
అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

వైఎస్సార్‌సీపీది అత్యంత నీచమైన పాలన.. నారా లోకేష్ ఫైర్

మాజీ ప్రేమికుడి వేధింపులు.. 22 ఏళ్ల టీచర్ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments