Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీ "2.O" ఫస్ట్ లుక్.. ఆడియో వేడుకకు రావాలని ఆ హీరోను అభ్యర్థిస్తున్న శంకర్

రజనీకాంత్ హీరోగా ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 2.O. ఈచిత్రం ఆడియో రిలీజ్ వేడుక ఈనెల 27వ తేదీన దుబాయ్ వేదికగా జరుగనుంది. ఈ ఆడియో వేడుకతోనే ప్రపంచం మొత్తం ఈ చిత్రం వైపు చూసేలా దర్శకుడు ప్లాన్

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2017 (13:55 IST)
రజనీకాంత్ హీరోగా ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 2.O. ఈచిత్రం ఆడియో రిలీజ్ వేడుక ఈనెల 27వ తేదీన దుబాయ్ వేదికగా జరుగనుంది. ఈ ఆడియో వేడుకతోనే ప్రపంచం మొత్తం ఈ చిత్రం వైపు చూసేలా దర్శకుడు ప్లాన్ చేశాడని చెప్పొచ్చు.
 
ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న 2.0 ఆడియోని ప్రపంచ ప్రసిద్ధ 7 స్టార్ హోటల్ బుర్జ్ దుబాయ్లో చాలా గ్రాండ్గా నిర్వహించేందుకు లైకా భారీ ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం జరిగే ఆడియో వేడుకలో 125 సింఫొనీ కళాకారులతో కలిసి ఏఆర్ రెహ్మాన్ సంగీత విభావరి ఉంటుందని తెలుస్తోంది. 
 
దుబాయ్‌ రాజు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ వేడుకలో పాల్గొనాల్సిందిగా కమల్‌ హాసన్‌ని దర్శకుడు శంకర్‌ కలిసి అభ్యర్థించినట్లు సమాచారం. అయితే రోజుకో పోస్టర్‌తో సినిమా మీద హైప్ పెంచుతున్న దర్శకుడు శంకర్, తాజాగా రజనీ లుక్‌ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్‌ను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేశాడు. ఈ పిక్ అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. 

ఈ సినిమాలో అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్ రోల్ పోషిస్తున్నాడు. ఈనేపథ్యంలో అక్షయ్ కుమార్ ఓ ట్వీట్ చేశారు. "ఇక.. 2.0 మ్యూజిక్ ఈవెంట్‌కు రెడీ అవ్వాలని... ఇంకా రెండు రోజులే ఉందని, ఈ మూవీ ఓ మహాకావ్యం" అంటూ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments