Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌పోర్టులో ఇళయరాజాకు చుక్కెదురు.. సారీ చెప్పిన అధికారి

Webdunia
బుధవారం, 8 జూన్ 2016 (09:29 IST)
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకి ఎయిర్ పోర్టులో చుక్కెదురైంది. ఇళయరాజా ఇటీవలే తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళూరులోని కొన్ని దేవాలయాలను దర్శించుకునేందుకు వెళ్లారు. దర్శనం ముగించుకుని ఇళయరాజా కుటుంబం తిరిగి చెన్నై చేరుకునేందుకు ఆదివారం కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. 
 
కాగా అధికారులు ఆయన బ్యాగులో ఏదో ఉందని అనుమానించి స్కానర్ వద్ద నిలిపివేసి పూర్తిగా తనిఖీలు చేపట్టారు. ఆయన బ్యాగ్‌లో కొబ్బరి ప్రసాదం మాత్రమే ఉందని చెప్పిన కూడా అధికారి పట్టించుకోలేదట. దీంతో కోపం చెందిన ఆయన తనయుడు కార్తీక్ రాజా సెక్యూరిటీతో గొడవకి దిగాడు. కార్తీక్ రాజా అంతటితో ఊరుకోకుండా తన మొబైల్ ద్వారా అక్కడి సెక్యూరిటీ అధికారి ఫొటోలను తీయడంతో గొడవ మరింత పెద్దదైంది.
 
ఆ ఫొటోలను మొబైల్ నుంచి తొలగించే వరకు అధికారి వారిని పంపించలేదు. తర్వాత అక్కడే ఉన్న ఒక ఒక విలేఖరి వచ్చి ''ఆయన సంగీత దర్శకుడు ఇళయరాజా'' అని చెప్పడంతో వారిని ఎయిర్ పోర్టులోకి అనుమతించారు. అక్కడ జరిగిన తతంగాన్ని సీసీటీవిలో వీక్షించిన ఉన్నతాధికారి వెంటనే ఇళయరాజాకు క్షమాపణలు చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. తర్వాత కాస్త ఆలస్యంగా బయలుదేరిన విమానంలో ఇళయరాజా కుటుంబం చెన్నైకి వెళ్లింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments