Webdunia - Bharat's app for daily news and videos

Install App

కబ్జా చిత్రంతో మురళీ శర్మ కన్నడ రంగప్రవేశం

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (13:15 IST)
Murali Sharma
మురళీ శర్మ తన కన్నడ అరంగేట్రం "కబ్జా"లో "వీర్ బహద్దూర్" అనే పాత్రను పోషిస్తున్నట్లు దర్శకుడు జె చంద్రు వెల్లడించారు.
 
ఈ చిత్ర తారాగణంలో ప్రముఖ నటులు ఉపేంద్ర, కిచ్చా సుదీప, శ్రియ శరణ్ ఉన్నారు. హిందీ, మరాఠీ, తెలుగు, తమిళం మరియు మలయాళంలో న‌టించిన‌ మురళీ శర్మ ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమలోకి "కబ్జా"తో అరంగేట్రం చేస్తున్నారు. చిత్రనిర్మాతలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల‌వైపు మొగ్గుచూపుతున్నారు. గతంలో కంటే మేక‌ర్స్ కంటెంట్‌పై ఎక్కువ నమ్మకంతో ఉన్నారు. ఇతర పాన్ ఇండియా చిత్రాలకు అనుగుణంగా "కబ్జా" కూడా వాటిలో ఒకటిగా రూపొందుతోంది. ఈ పీరియాడికల్ డ్రామా ప్రకటించినప్పటి నుంచి చిత్రంపై ప‌రిశ్ర‌మ‌లో క్రేజ్ ఏర్ప‌డింది. 
 
మురళి శ‌ర్మ ఇప్ప‌టివ‌ర‌కు 200ల‌కుపైగా చిత్రాలలో నటించారు మరియు త‌న న‌ట‌న‌లో భిన్న‌మైన పార్శాల‌ను చూపిస్తూ ఎల్లప్పుడూ ప్రశంసలు అందుకున్నారు. త‌ను  ప్రధానంగా వెండితెర‌పై పోలీసు పాత్ర పోషించడంలో ప్రసిద్దిగాంచారు.
 
ఈ సంద‌ర్భంగా చిత్ర దర్శకుడు జె చంద్రు మాట్లాడుతూ.. "మురళి శ‌ర్మ‌ తెలుగు, హిందీ ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందారు. `అల వైకుంఠపురములో` ఆయన చేసిన పాత్ర ఆయనకు ఎంతో పేరు ప్ర‌ఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది. మా సినిమాలో కీలకమైన పాత్రలో నటించేందుకు ఆయనను సంప్రదించాలని నిర్ణయించుకుకోవ‌డానికి ఇదే కారణం. చిత్ర క‌థ‌లో రాజ బహద్దూర్ కుటుంబానికి చెందిన వీర బహద్దూర్ పాత్ర‌ను ఆయ‌న పోషిస్తున్నారు.
 
దీనిపై మురళి శ‌ర్మ స్పందిస్తూ, "నాకు కన్నడ మాట్లాడటం రాదు కాబట్టి నేను మొదట్లో కొంచెం భయపడ్డాను. క‌న్న‌డ‌లో న‌టించ‌డం అంద‌మైన అనుభూతి క‌లిగింది.  అందుకు క్రెడిట్ అంతా దర్శకుడు జె చంద్రుకే చెందుతుంది.  క‌థ‌లో కీల‌క‌మైన పాత్ర‌తోపాటు  పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్, ఇప్పికే కొన్ని చ‌క్క‌టి స‌న్నివేశాల్లో న‌టించాను.  అవి చాలా బాగా వచ్చాయి, పాత్ర‌ప‌రంగా దర్శకుడు సంతోషంగా ఉన్నాడు కాబట్టి నేనూసంతోషంగా ఉన్నాను  అన్నారు.
 
ఈ చిత్రానికి సంబంధించిన ఒక భారీ షెడ్యూల్‌ను ఇటీవలే పూర్తిచేసిన‌ట్లు ఫిలిం మేక‌ర్స్‌ తెలిపారు. దీంతో దాదాపు 85% సినిమాను పూర్తి చేశాం. మరో భారీ షెడ్యూల్ చేయాల్సివుంది. త‌దుప‌రి షెడ్యూల్‌ దాదాపు 20 రోజుల షూటింగ్ చేయ‌నున్నాం. ఈ షెడ్యూల్లో మరికొందరు కొత్త నటీనటులు పాల్గొన‌నున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు.. రేవంత్ రెడ్డి

అసెంబ్లీకి హాజరయ్యే ధైర్యం లేకుంటే జగన్ రాజీనామా చేయాలి: షర్మిల

పిజ్జా ఆర్డర్ చేస్తే.. అందులో పురుగులు కనిపించాయ్.. వీడియో

బాలినేనికి కేబినెట్‌లో స్థానం.. చంద్రబాబుకు తలనొప్పి.. పవన్ పట్టుబడితే?

సోషల్ మీడియాను దుర్వినియోగపరిచే వారికి ఎలాంటి శిక్షలు వున్నాయో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments