Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంజ్యా నటి శర్వారి కి బాహుబలి సత్యరాజ్ కి కనెక్ష‌న్‌ !

డీవీ
గురువారం, 6 జూన్ 2024 (16:43 IST)
Sharwari, Sathyaraj
శర్వారి ప్రధాన పాత్రలో నేష్ విజన్ బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా ‘ముంజ్యా’ అనే చిత్రం రాబోతోంది. ఈ చిత్రంలో సత్య రాజ్ ప్రముఖ పాత్రను పోషించారు. ఇక బాహుబలితో కట్టప్పగా ఫేమస్ అయిన సత్య రాజ్‌తో పని చేసిన అనుభవం గురించి శర్వారి చెబుతూ ఎంతో ఎగ్జైట్ అయ్యారు.
 
‘ఎస్ఎస్ రాజమౌళి అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన తీసిన బాహుబలికి వీరాభిమానిని. ఆ మూవీని ఎన్నో సార్లు చూశాను. ఇక ఈ చిత్రంలో కట్టప్పగా చేసిన సత్య రాజ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోబోతోన్నానని తెలియడంతో ఎంతో సంతోషించాను.సెట్‌లో మొదటి రోజు నుండి సత్యరాజ్ అంకితభావం, నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను.
 
సత్యరాజ్ సర్‌ని సెట్‌లో చూడటంతో ప్రతిరోజూ యాక్టింగ్ వర్క్‌షాప్‌కు హాజరైనట్లుగా ఉంది. అతని బహుముఖ ప్రజ్ఞ, సహనం, పరిపూర్ణ ప్రతిభ అన్నిటినీ మించిపోయింది. అది కామిక్ సీన్ అయినా లేదా ఇంటెన్స్ మూమెంట్ అయినా, సత్యరాజ్ సర్ ఎంతో సెటిల్డ్‌గా ప్రతి సన్నివేశానికి జీవం పోశారు. ఆయనతో కలిసి మళ్లీ పని చేయాలని ఉంది. అలాంటి అవకాశం మళ్లీ వస్తుందని ఆశిస్తున్నాను' అని అన్నారు.
 
దినేష్ విజన్ సమర్పణలో, ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన ముంజ్యా చిత్రాన్ని దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. 2024 జూన్ 7న ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments