Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిట్ కంటే కఠినుడు బిగ్ బాస్... ముమైత్ నోరు కట్టేశాడు.. మాటాలేదు. ఫోనూ లేదు

మాదకద్రవ్యాల సరఫరా, విక్రయం, వినియోగం కేసులో బుక్కయిన ముమైత్ ఖాన్ వాస్తవానికి బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో బిజీగా ఉన్నారు. కానీ సిట్ విచారణకు హాజరు కావటం తప్పనిసరి కావడంతో ఆమె బిగ్ బాస్ ఇంట్లోనుంచి బయటకు రాక తప్పింది కాదు. అయితే ఈ షో నియమాల ప్రకారం ఎలిమి

Webdunia
శుక్రవారం, 28 జులై 2017 (07:23 IST)
మాదకద్రవ్యాల సరఫరా, విక్రయం, వినియోగం కేసులో బుక్కయిన ముమైత్ ఖాన్ వాస్తవానికి బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో బిజీగా ఉన్నారు. కానీ సిట్ విచారణకు హాజరు కావటం తప్పనిసరి కావడంతో ఆమె బిగ్ బాస్ ఇంట్లోనుంచి బయటకు రాక తప్పింది కాదు. అయితే ఈ షో నియమాల ప్రకారం ఎలిమినేట్ అయితే తప్ప పోటీదారులెవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడానికి వీల్లేదు. కానీ పోలీసు విచారణ కావడంతో అనివార్యంగా ముమైత్‌ను బయటకు పంపక తప్పింది కాదు. 
 
ఆ రకంగా బిగ్ బాస్ చరిత్రలో హోస్ట్ బిగ్ బాస్ ఇంటినుంచి బయటపడటం ఇదే తొలిసారి. కాని సిట్ విచారణ పూర్తి కాగానే బిగ్ బాస్ నిర్వాహకుల ఆదేశాల ప్రకారం ముమైత్ నేరుగా హైదరాబాద్ నుంచి పుణే వెళ్లి తిరిగి బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించింది.. ఈ సందర్భంగా ఆమె బయట ఎవరితోనూ మాట్లాడకుండా, ఫోన్ కాల్ చేయకుండా బిగ్ బాస్ నిర్వాహకులు ముమైత్‌ని నీడలాగా వెంటాడారు. దీంతో సిట్ అధికారుల కంటే బిగ్ బాసే కఠినంగా వ్యవహరించినట్లయింది.
 
బిగ్‌బాస్‌ షో నుంచి బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ముమైత్‌ ముంబై నుంచి విమానంలో హైదరాబాద్‌ వచ్చారు. బిగ్‌బాస్‌ షో ఒప్పందం ప్రకారం 70 రోజుల పాటు సెల్‌ఫోన్‌లో మాట్లాడకూడదు, షో విషయాలను షేర్‌ చేయకూడదు. అత్యసవరాల్లో బయటకు వెళ్లాల్సి వచ్చినా ఇతరులతో ఏమీ మాట్లాడొద్దన్న నిబంధనలున్నాయి. దీనితో నిర్వాహకుల తరఫున నలుగురు వ్యక్తులు ముమైత్‌తో పాటు హైదరాబాద్‌ వచ్చారు. ప్రైవేట్‌ హోటల్‌లో బస చేసి ఉదయం సిట్‌ కార్యాలయానికి కూడా వారు వచ్చారు. 
 
సాయంత్రం విచారణ పూర్తయ్యాక వారితో కలిసి ముమైత్‌ తాను బస చేసిన హోటల్‌కు వెళ్లారు. రాత్రి 7.30 ప్రాంతంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. విచారణ బాగానే జరిగిందని అక్కడ మీడియాకు చెప్పారు. రాత్రి 8.45 గంటల విమానంలో ఆమె బిగ్ బాస్ నిర్వాహకులతో కలిసి పుణే వెళ్లారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త వేధింపులకు టెక్కీ ఆత్మహత్య... పుట్టింటి నుండి డబ్బులు తీసుకురావాలని?

తాపీ మేస్త్రిగా మారిన రాహుల్ గాంధీ.. ఎక్కడ? (Video)

ఆరో తరగతి చదువుతున్న బాలికతో యువకుడి పెళ్లి..!!

గన్నవరంలోని గోడౌన్‌లో రూ.2.46 కోట్ల సిగరెట్లు స్వాధీనం

కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్ వద్ద బాలీవుడ్ నటుడు సోనూసూద్..(Video Viral)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments