Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న చిత్రంముంబై షెడ్యూల్ పూర్తి

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (17:38 IST)
nani 30
నేచురల్ స్టార్ నాని ల్యాండ్‌మార్క్ 30వ చిత్రం షూటింగ్ నూతన దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో శరవేగంగా సాగుతోంది. గోవాలో లాంగ్ షెడ్యూల్ తర్వాత, మేకర్స్ ఇప్పుడు ముంబై షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసారు. కూనూర్‌లో సినిమా నెక్స్ట్  షెడ్యూల్ కోసం టీమ్ అంతా సిద్ధమయ్యారు.
 
మేకర్స్ విడుదల చేసిన ఒక చిన్న వీడియోలో నాని తన ముఖాన్ని హూడీతో కప్పుకుని సముద్రపు ఒడ్డున నడుస్తున్నట్లు కనిపించారు. తర్వాత కూనూర్‌లో ఒక అందమైన లొకేషన్ కనిపించింది.
 
సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో కథానాయిక. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుండగా, కోటి పరుచూరి సిఒఒగా వ్యవహరిస్తున్నారు.
 
ఈ చిత్రంలో కొంతమంది ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ ISC డీవోపీగా, హృదయం ఫేమ్‌ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
 ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా, సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా  పని చేస్తున్నారు.  
 యూనిక్ స్టొరీ లైన్ తో పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments