Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌కు చేరిన జైత్వానీ కాదంబరి.. పోలీసుల సెక్యూరిటీతో విజయవాడకు..

ఠాగూర్
శుక్రవారం, 30 ఆగస్టు 2024 (10:49 IST)
గత వైకాపా పాలకులతో పాటు.. ఐపీఎస్ అధికారుల నుంచి చిత్రహింసలు ఎదుర్కొని, మానసికంగా, శారీరకంగా అనే ఇబ్బందులు ఎదుర్కొన్న బాలీవుడ్ నటి జైత్వానీ కాదంబరం ముంబై నుంచి హైదరాబాద్‌కు శుక్రవారం ఉదయం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల భద్రతతో రానున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌పై బాలీవుడ్ నటి జైత్వానీ కాదంబరి పెట్టిన అత్యాచారం కేసు సెటిల్మెంట్‌ చేసేందుకు రంగంలోకి దిగిన వైకాపా నేతలు, ఐపీఎస్ అధికారులకు ఇపుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దీంతో జైత్వానీ కాదంబరి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతుంది. అలాగే, వైకాపా నేతలతో పాటు పలువురు ఐపీఎస్ అధికారులను ఆందోళనకు గురిచేస్తుంది.
 
ఆమెను, ఆమె కుటుంబాన్ని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు కొందరు సీనియర్ ఐపీఎస్‌లు వేధించారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ న్యూస్ ఛానల్‌తో ఆమె మాట్లాడతూ కీలక విషయాలను బయటపెట్టారు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఆమె స్టేట్మెంట్‌ను రికార్డ్ చేయాలని విజయవాడ పోలీసులు నిర్ణయించారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చేందుకు ఆమె శుక్రవారం ముంబై నుంచి హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆమెను విజయవాడకు తీసుకునిరానున్నారు. 
 
మరోవైపు, ఆమె కుటుంబ సభ్యులతో విజయవాడ పోలీస్ కమిషనర్ మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ... ఇబ్రహీంపట్నంలో నమోదైన కేసు వివరాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఏపీ డీజీపీ కేసు వివరాలపై ఆరా తీశారని తెలిపారు. ఈ కేసు విచారణ అధికారిణిగా స్రవంతి రాయ్‌ని నియమించామన్నారు. సినీ నటిపై చీటింగ్ కేసు పెట్టి... మొత్తం కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేశారో ఆరా తీస్తామని అన్నారు. నాలుగైదు రోజుల్లో విచారణ పూర్తవుతుందని చెప్పారు. డీజీపీకి పూర్తి నివేదిక అందిస్తామని తెలిపారు. ఐపీఎస్‌ల పాత్ర ఉంటే వారిపై చర్యలు ఖచ్చితంగా ఉంటాయని కీలక వ్యాఖ్యలు చేశారు. 


 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments