Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలింఫేర్ నామినేషన్స్ లో సత్తా చాటిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి

డీవీ
బుధవారం, 17 జులై 2024 (15:55 IST)
Naveen, anuksha
హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ గతేడాది సెప్టెంబర్ 7న రిలీజై ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా తాజాగా అనౌన్స్ చేసిన ఫిలింఫేర్ సౌత్ 2024 నామినేషన్స్ లో సత్తా చాటింది. మూడు మేజర్ కేటగిరీల్లో ఈ సినిమాకు నామినేషన్స్ దక్కాయి.
 
బెస్ట్ యాక్టర్ మేల్ గా నవీన్ పోలిశెట్టి, బెస్ట్ యాక్టర్ ఫీమేల్ గా అనుష్క శెట్టి, బెస్ట్ మూవీ కేటగిరీల్లో "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" నామినేషన్స్ అందుకుంది. నవీన్ శెట్టి స్టాండప్ కమెడియన్ గా నవ్వించడమే కాదు ఎమోషనల్ గా పర్ ఫార్మ్ చేసి మెప్పించాడు. అనుష్క శెట్టి నటనలోని భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కదిలించాయి. ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా సకుటుంబ ప్రేక్షకులకు అలరించింది "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి". నామినేషన్స్ పొందిన మూడు మేజర్ కేటగిరీల్లో ఈ సినిమా ఫేవరేట్ గా ఉంది. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌ నిర్మించారు. తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ ప్రేక్షకులు ఆదరణ పొందింది "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి".

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Crime News : భార్య, అత్తపై క్యాబ్ డ్రైవర్ కత్తితో దాడి

Chief PSR Anjaneyulu: నటి జెత్వానీ వేధింపుల కేసు.. ఆంజనేయులు అరెస్ట్

ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు

ప్రపంచ ధరిత్రి దినోత్సవం- మన శక్తి, మన గ్రహం థీమ్ ఇదే!

Namo Bharat: ఏప్రిల్ 24న నమో భారత్ రాపిడ్ రైలు సేవను ప్రారంభించనున్న ప్రధాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

తర్వాతి కథనం
Show comments