Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎఫ్-2 బతికించింది.. ఆ మూడు సినిమాలు ముంచేశాయి..

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (17:36 IST)
అక్కినేని అఖిల్‌ను ఫ్లాప్‌లు వదలట్లేదు. అఖిల్, హలో, మజ్ను సినిమాలు హిట్ కాకుండా ఫ్లాప్ టాక్‌ను సంపాదించి పెట్టాయి. తెలుగు చిత్ర సీమకు 2018 బాగా కలిసొచ్చింది. అయితే 2019 కూడా వరుస హిట్లు వుంటాయని ట్రేడ్ వర్గాలు భావించారు. 
కానీ 2019 ప్రారంభంలోనే ఎన్టీఆర్, వినయ విధేయ రామ, ఎఫ్-2, మిస్టర్ మజ్ను వంటి సినిమాలు విడుదలైనా.. ఈ సినిమాల్లో మూడు సినిమాలు ఓవర్సీస్ లో దారుణ పరాజయాన్ని చవి చూశాయి. ఎన్టీఆర్, వినయ విధేయ రామ సినిమాలు సంక్రాంతి సీజన్ లో విడుదలైనా మిలియన్ క్లబ్ లోకి ఎంటర్ కాలేకపోయాయి. వినయ, ఎన్టీఆర్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ  'ఎఫ్2' మాత్రమే ఇప్పటికే 2 మిలియన్ క్లబ్ లో చేరడం విశేషం. 
 
భారీ అంచనాల మధ్య జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిస్టర్ మజ్ను డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా 3 కోట్ల ఓవర్సీస్ బిజినెస్ జరిగింది.
 
అక్కినేని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్న మజ్ను కూడా ఫ్లాప్ కావడంతో.. టాలీవుడ్‌కు 2019 ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. కామెడీకి పెద్ద ప్రాధాన్యం ఇచ్చిన వెంకీ, వరుణ్, తమన్నా, మెహ్రీన్‌ల ఎఫ్-2 మాత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది. కలెక్షన్ల పరంగా మంచి విజయాన్ని సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments