Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియా ప్రకాశ్ బాటలో ఐఎఎస్ టాపర్... (video)

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (16:47 IST)
ప్రియా ప్రకాష్ వారియర్... ఈ పేరు దాదాపు అందరికీ మరీ ముఖ్యంగా యూత్‌కు సుపరిచితమే. కన్నుగీటి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ సన్నిలియోన్ కంటే ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ మలయాళీ అమ్మడు ఇప్పుడు వరుస సినిమా అవకాశాలతో బాలీవుడ్‌లో కూడా అడుగుపెడుతోంది.


ఆమె పాపులారిటీకి కారణం.. ఆ కన్నుకొట్టే వీడియో వైరల్ కావడమే. ఇప్పుడు ఆమెలాగానే మరో ఐఏఎస్ టాపర్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2016లో ఐఏఎస్ టాపర్‌గా నిలిచిన టీనా దబీఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇటీవల చేతికి ఉన్న మెహెందీని చూపుతూ సరదాగా కన్నుగీటింది. ఈ వీడియోలో ఆమె ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫిదా అయిన నెటిజన్లు షేర్ చేయడంతో పాటుగా తెగ మెచ్చేసుకుంటున్నారు.
 
దళిత యువతి అయిన టీనా దబీ ఐఏఎస్ టాపర్‌గా నిలిచిన మీదట ప్రస్తుతం రాజస్థాన్‌లోని బిల్వారాలో సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్‌గా పని చేస్తున్నారు. ఇటీవల ఆమె వేరే మతానికి చెందిన ఐఏఎస్ అధికారి అతర్ అమర్ ఉల్ షఫీ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించారు.

ఇప్పుడు తాజాగా కన్నుగీటే వీడియోతో మరోసారి సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ వీడియోలో ఆమె తన చేతికి ఉన్న మెహందీ చూపుతూ కన్నుగీటింది. మరి నెటిజన్లకు ఇందులో ఏమి కనిపించిందో కానీ వీడియోకు విపరీతంగా హైప్‌ను పెంచేస్తున్నారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలను దూషించడమే హిందుత్వమా? మాధవీలత

నిమిష ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసిన యెమెన్

గండికోటలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - అతనే హంతకుడా?

హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

భర్తను హత్య చేయించి.. కంట్లో గ్లిజరిన్ వేసుకుని నటించిన భార్య...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments