మోనికా చౌహాన్, కమల్ కామరాజు, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్ ఒసేయ్ అరుంధతి. విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో గూడూరు ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టైటిల్ లిరికల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఒసేయ్ అరుంధతి పాటను చిత్ర దర్శకుడు విక్రాంత్ కుమార్ చాలా బాగా రాశారని ఆయన పేర్కొన్నారు. లిరిక్స్ క్యాచీగా ఉండటంతో చాలా మంచి మ్యూజిక్ ఇచ్చామన్నారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడారని తెలిపారు.
చిత్ర నిర్మాత గూడూరు ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ, ఈరోజు ఒసేయ్ అరుంధతి అంటూ సాగే టైటిల్ ట్రాక్‌ను విడుదల చేయటం ఆనందంగా ఉంది. కమల్ కామరాజు, వెన్నెల కిషోర్, మోనికలతో ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌గా ఒసేయ్ అరుంధతి సినిమాను నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం అన్నారు.
చిత్ర దర్శకుడు విక్రాంత్ కుమార్ మాట్లాడుతూ... హైదరాబాద్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇల్లాలుఅరుంధతి పిల్లాడితో పాటు ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉంటుంది. ఓసారి సత్యనారాయణ స్వామి వత్రం చేయాలని అనుకుంటుంది. అయితే అనుకోకుండా అరుంధతికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి తనని తాను కాపాడుకుంటూ ఇంటి పరువును ఎలా కాపాడుకుంటుందనేదే ఒసేయ్ అరుంధతి సినిమా. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ ప్రధానంగా సాగే చిత్రమిది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నారు.