Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటిగా ఎనలేని సంతృప్తినిచ్చిన చిత్రం మామ్ : శ్రీదేవి

తన యాభై ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించాను. కానీ నటిగా నాకు ఎనలేని సంతృప్తిని మిగిల్చిన చిత్రం మామ్ అని అందాల నటి శ్రీదేవి చెప్పుకొచ్చింది. అంతేకాకుండా, అమ్మ ప్రేమ గొప్పతనాన్ని చాట

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (11:27 IST)
తన యాభై ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించాను. కానీ నటిగా నాకు ఎనలేని సంతృప్తిని మిగిల్చిన చిత్రం మామ్ అని అందాల నటి శ్రీదేవి చెప్పుకొచ్చింది. అంతేకాకుండా, అమ్మ ప్రేమ గొప్పతనాన్ని చాటిచెప్పే చిత్రమిదన్నారు. 
 
ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మామ్. రవి ఉద్యవార్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్, సునీల్ మన్‌చందా, నరేష్ అగర్వాల్, ముఖేష్, గౌతమ్‌జైన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విడుదలచేసింది. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ఈ ఏడాది నా భర్త ఇచ్చిన గొప్ప బహుమతి ఈ చిత్రమన్నారు. 
 
దర్శకుడు చెప్పిన కథ వినగానే కన్నీళ్లు వచ్చాయి అని అన్నారు ప్రముఖ నటి శ్రీదేవి. కుటుంబ బంధాలకు సున్నితమైన భావోద్వేగాలను మేళవించి దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. కథ నన్ను చాలా ఆకట్టుకుంది. ఒకవేళ నేను ఈ సినిమాలో నటించకపోయినా మీరు నిర్మించాలని నా భర్త వద్ద మాట తీసుకున్నాను. నా కూతుళ్లు ఈ సినిమా చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఆ క్షణమే ఈ సినిమా సక్సెస్ అవుతుందని అర్థమైందన్నారు. 
 
నా పిల్లలు, నేను స్నేహితుల్లా కలిసిపోయి ఉంటాం అని అన్నారు. సుదీర్ఘ సినీ జీవితంలో శ్రీదేవి ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించిందని, మామ్‌లో తను చేసిన పాత్ర వాటికి మించి ఉంటుందని, జూలై 7న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని బోనీ కపూర్ అన్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments