Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

డీవీ
శుక్రవారం, 29 నవంబరు 2024 (18:51 IST)
Mokshagna
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు మనవడు, అగ్రహీరో-పొలిటీషియన్ నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ, రీసెంట్ బ్లాక్‌బస్టర్ హనుమాన్‌ డైరెక్టర్ క్రియేటివ్ జెమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించే క్రేజీ ప్రాజెక్ట్‌తో గ్రాండ్‌గా అరంగేట్రం చేయబోతున్నారు. 
 
మోక్షజ్ఞ తొలి చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగం అవుతుంది. మెమరబుల్ పెర్ఫార్మెన్స్‌తో అలరించడానికి మోక్షజ్ఞ నటన, ఫైట్లు, డ్యాన్స్‌లలో ఇంటెన్స్ ట్రైనింగ్ పొందారు. మోడరన్, స్టైలిష్ లుక్‌లో అద్దంలోకి చూస్తున్న మోక్షజ్ఞ కొత్త స్టిల్ విడుదలైంది. ఈ స్టిల్ అతని నేచురల్ చరిస్మా, కాన్ఫిడెన్స్ ని ప్రజెంట్ చేస్తోంది. 
Mokshagna
 
పర్ఫెక్ట్ స్టైల్ చేసిన హెయిర్, గడ్డంతో, చెక్ షర్ట్ ధరించి అద్భుతంగా కనిపించారు. అతని స్లీక్ ఎప్పిరియన్స్ తెలుగు చిత్ర పరిశ్రమలో కాబోయే ప్రామిసింగ్ స్టార్‌ని సూచిస్తుంది. ఎమ్ తేజస్విని నందమూరి ప్రెజెంటర్‌గా, లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. 
 
మోక్షజ్ఞ పుట్టినరోజున అనౌన్స్ చేసిన ఈ చిత్రం ఇప్పటికే సంచలనం సృష్టించింది.  పౌరాణిక ఇతిహాసం నుంచి ప్రేరణ పొందిన ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు.
 
నటీనటులు: నందమూరి మోక్షజ్ఞ
సాంకేతిక సిబ్బంది: 
రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్
ప్రెజెంటర్: ఎం తేజస్విని నందమూరి
పీఆర్వో: వంశీ-శేఖర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments