Webdunia - Bharat's app for daily news and videos

Install App

''జిమ్మిక్కీ క‌మ్మాల్'' పాటకు మోహన్ లాల్ స్టెప్స్-వీడియో చూడండి

మలయాళ నటుడు మోహన్ లాల్ జిమిక్కీ కమ్మాల్ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటను ఓనమ్ సందర్భంగా నెటిజన్లు తెగ నచ్చేసిందంటూ పోస్టులు చేశారు. ఆపై ఈ పాటకు స్టెప్పులేస్తూ మరికొందరు సోషల్ మీడియాలో పోస్టు

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (12:58 IST)
మలయాళ నటుడు మోహన్ లాల్ జిమిక్కీ కమ్మాల్ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటను ఓనమ్ సందర్భంగా నెటిజన్లు తెగ నచ్చేసిందంటూ పోస్టులు చేశారు. ఆపై ఈ పాటకు స్టెప్పులేస్తూ మరికొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అప్పటి నుంచి ఈ పాట సోషల్ మీడియా ట్రెండ్స్‌లో చోటుసంపాదించుకుంది. 
 
మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్‌లాల్ న‌టించిన ''వెలిపాడిందే పుస్త‌గం'' చిత్రంలోని ''జిమ్మిక్కీ క‌మ్మాల్'' పాటకు ప్రతి ఒక్కరూ స్టెప్పులేసి వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. వారిలో కొంత‌మంది అభిమానులు హీరో మోహ‌న్‌లాల్‌ని కూడా ఈ పాట‌కు డ్యాన్స్ వేయాల‌ని కోరారు.

నిజానికి ఈ సినిమాలో హీరో ఆయ‌నే అయిన‌ప్ప‌టికీ ఈ పాట‌లో ఆయ‌న డ్యాన్స్ చేస్తూ కనిపించే సన్నివేశాలుండవు. కానీ పాటకు చివర్లో మాత్రం మోహన్ లాల్ సైకిల్ నడుపుతూ కనిపిస్తారు. అందుకే ఫ్యాన్స్ ఆయనకు ఈ పాటకు స్టెప్పులేసి వీడియో పోస్టు చేయమని సవాల్ చేశారు. 
 
ఆ ఛాలెంజ్‌కు మోహన్ లాల్ సరైన సమాధానం చెప్తూ.. పాటకు స్టెప్పులేసి వీడియోను త‌న ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. పోస్ట్ చేసిన 19 గంటల్లోనే ల‌క్షా డెబ్బై వేల‌కు పైగా లైకులు, 90వేల‌కు పైగా షేర్లు, 5,145,021 వ్యూస్ నమోదైనాయి. ఈ వీడియోను మీరూ చూడండి..
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments