Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబరులో మోహన్ లాల్ 'మన్యం పులి'

మల్లూవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన తాజా సినిమా పులిమురుగన్ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మళయాల సీమలో భారీ కలెక్షన్స్‌తో గత రికార్డులు అన్నింటిని బ్రేక్ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కూ

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (17:37 IST)
మల్లూవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన తాజా సినిమా పులిమురుగన్ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మళయాల సీమలో భారీ కలెక్షన్స్‌తో గత రికార్డులు అన్నింటిని బ్రేక్ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా అదే జోరున కొనసాగతోంది. ఇప్పటివరకు రూ.100 కోట్లకి పైగా వసూళ్ల రాబట్టి మల్లూవుడ్‌లోనే కాదు మోహన్ లాల్ కెరీర్‌లో సైతం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది పులిమురుగన్. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ సర్వసతి ఫిల్మ్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి 'మన్యం పులి' పేరిట విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. 
 
అయితే నవంబర్ 25న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ప్రస్తుత పరిస్థితుల రిత్య వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాత తెలిపారు. అలానే డిసెంబర్ నెలలో మరో విడుదల తేదీని ఫిక్స్ చేసి భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు కృష్ణారెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుంటే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్స్ అందుకుంటోన్న ‘మన్యం పులి’ తెలుగులో సైతం సెంట్ పర్సెంట్ సక్సెస్ అందుకునే అవకాశం ఉందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. 
 
దాదాపు రెండు సంవత్సరాలు పాటు ఈ సినిమాను కేరళ, వియత్నాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. పీటర్ హేన్స్‌ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్‌గా నిలుస్తాయని, చిత్ర బృందం తెలిపింది. జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments