Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా బాగా లేకపోతే తిడతా - బాలక్రిష్ణకు షాక్.. పళ్లు నూరుతున్న నట సింహం

ఈమధ్య కాలంలో బాలక్రిష్ణకు టైం సరిగా లేనట్లుంది. ఎందులో చేతులు పెట్టినా అది కాస్త కాలి చివరకు చిరిగి చిరిగి చేటలా మారుతోంది. అదేనండి సంబంధం లేని వ్యవహారాలు బాలక్రిష్ణకు చుట్టుకుని చివరకు ఆయనకు చెడ్డపేరు వస్తోంది. గత కొన్నిరోజుల ముందు ఒక అభిమానిని చెంప

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (12:35 IST)
ఈమధ్య కాలంలో బాలక్రిష్ణకు టైం సరిగా లేనట్లుంది. ఎందులో చేతులు పెట్టినా అది కాస్త కాలి చివరకు చిరిగి చిరిగి చేటలా మారుతోంది. అదేనండి సంబంధం లేని వ్యవహారాలు బాలక్రిష్ణకు చుట్టుకుని చివరకు ఆయనకు చెడ్డపేరు వస్తోంది. గత కొన్నిరోజుల ముందు ఒక అభిమానిని చెంపపై కొట్టి వార్తల్లోకెక్కిన బాలక్రిష్ణకు ఆ రోజే పూరి జగన్నాథ్ డైలాగ్‌లతో మరింత ఇరకాటంలో నెట్టింది. బాలక్రిష్ణకు కోపం వస్తే ఏం చేస్తారో తెలియదు.. ఆయన అందరి లాంటి వ్యక్తి కాదంటూ పూరి జగన్నాథ్‌ పైసా వసూల్ ఫంక్షన్లో చెప్పిన మాటలు బాలక్రిష్ణను ఇరకాటంలో నెట్టాయి.
 
మళ్ళీ రెండురోజుల క్రితం పైసా వసూల్‌కు సంబంధించిన కార్యక్రమంలో నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హాజరయ్యారు. బాలక్రిష్ణను అమాంతం పొగడ్తలతో ముంచెత్తుతూనే ఈ సినిమాపై అంచనాలు ఎంతో ఉన్నాయి. సినిమా బాగలేకుంటే మాత్రం ఫోన్ చేసి మరీ తిడతాను అంటూ బాలక్రిష్ణను చూస్తూ మోహన్ బాబు అన్నారు. దీంతో ఒక్కసారిగా బాలక్రిష్ణ షాక్‌కు గురయ్యారు. 
 
కొద్దిసేపటికి తేరుకుని అలా మోహన్ బాబును చూస్తూ ఉండిపోయారు. ఆ కార్యక్రమానికి హాజరైన అభిమానులు కూడా మోహన్ బాబు మాటలు విని ఆశ్చర్యపోయారు. మోహన్ బాబు మాటలకు బాలక్రిష్ణకు చిర్రెత్తుకొచ్చింది. కోపాన్ని పంటి బిగువున దిగమింగుకుని బాలక్రిష్ణ సైలెంట్‌గా ఉన్నారు. 
 
నందమూరి తారకరామారావును గురువుగా భావిస్తారు మోహన్ బాబు. అందుకే మోహన్ బాబును బాలక్రిష్ణ ఫంక్షన్‌కు అతిథిగా పిలిచారు. కానీ మోహన్ బాబు మత్రం బాలక్రిష్ణను ఇరకాటంలో పెట్టే ప్రసంగం చేయడంతో బాలక్రిష్ణ, మోహన్ బాబుల మధ్య గ్యాప్ వచ్చినట్లు తెలుగు సినీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments