Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశం నీ హద్దురాలో భక్తవత్సలం నాయుడుగా డాక్టర్ మోహన్ బాబు ఫస్ట్ లుక్ విడుదల

Webdunia
శనివారం, 29 ఫిబ్రవరి 2020 (22:00 IST)
సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్న డాక్టర్ మోహన్ బాబు చివరగా నటించిన చిత్రం.. జాతీయ అవార్డులు పొందిన ‘మహానటి’. సూర్య హీరోగా నటిస్తోన్న సినిమా ‘ఆకాశం నీ హద్దురా‘లో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం తనను సంప్రదించినప్పుడు వెంటనే ఆయన అంగీకరించారు. సుధ కొంగర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదలకు సిద్ధమవుతోంది. 
 
కాగా, ఈ సినిమాకు సంబంధించి మోహన్ బాబు పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. వాటిలో ఆయన సీనియర్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా డైనమిక్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. సినిమాలో ఆయన పాత్రపేరు భక్తవత్సలం నాయుడు. ఎయిర్‌ఫోర్స్‌లో తెలుగు ప్రాంతానికి చెందిన ఉన్నతస్థాయి అధికారిగా ఆయన కనిపించనున్నారు. మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు అనే విషయం మనకు తెలిసిందే. సినిమాలో ఆయనది సూర్యకు మార్గనిర్దేశకునిగా పాత్ర. 
 
తమిళ వెర్షన్ కోసం తన పాత్రకు ఆయన స్వయంగా డబ్బింగ్ చెప్పారు. మోహన్ బాబుపై చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణ అవుతాయనీ, ఆయన పాత్రను అభిమానులు బాగా లైక్ చేస్తారనీ చిత్ర బృందం చెబుతోంది. తనకే సాధ్యమైన విలక్షణ శైలితో ఆ పాత్రను ఆయన రక్తి కట్టించారు. సామాన్యులకు సైతం విమాన యానాన్ని సులభతరం చేయడానికి ఎయిర్ దక్కన్ అనే ఎయిర్‌లైన్ సంస్థను స్థాపించిన కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ‘ఆకాశం నీ హద్దురా’ రూపొందుతోంది. 
 
ఈ సినిమాలో సూర్య జోడీగా అపర్ణా బాలమురళి నటిస్తున్నారు. పనిచేసిన వారందరికీ కలకాలం గుర్తుండిపోయేలా ఈ సినిమాను సుధ కొంగర రూపొందిస్తున్నారు. ఆసక్తికరమైన స్క్రిప్ట్, అత్యున్నత స్థాయి సాంకేతిక విలువలను మేళవించి ఆమె దీన్ని తీర్చిదిద్దుతున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమా బాలీవుడ్ నిర్మాత గునీత్ మోంగాకు దక్షిణాదిన తొలి సినిమా కావడం గమనార్హం. 
 
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. 2020 ఏప్రిల్ 9న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Roja: భయం అనేది మా నాయకుడు జగన్ రక్తంలో లేదు.. ఆర్కే రోజా (video)

Chandrababu: అంబేద్కర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments