Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనోజ్ - మౌనికల నుంచి ముప్పు వుంది.. పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు

ఠాగూర్
మంగళవారం, 10 డిశెంబరు 2024 (13:33 IST)
తనకు తన కుమారుడు మంచు మనోజ్, కోడలు మౌనికల నుంచి తనకు ముప్పు పొంచివుందని నటుడు డాక్టర్ మంచు మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన రాచకొండ పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. మంచు ఫ్యామిలీలో తలెత్తిన వివాదంపై పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇపుడు సంచలనంగా మారింది. 
 
తన చిన్న కుమారుడు మంచు మనోజ్, కోడలు మౌనికపై చర్యలు తీసుకోవాలంటూ మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మంచు మనోజ్, మౌనికల నుంచి తనకు ముప్పు ఉందన్నారు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఈ మేరకు మోహన్ బాబు సీపీకి లేఖ రాశారు.
 
నాలుగు నెలల క్రితం తన ఇంటి నుంచి వెళ్లిపోయిన మంచు మనోజ్... మళ్లీ తన ఇంటికి వచ్చి, కొందరు సంఘ విద్రోహ శక్తులతో కలిసి అలజడి సృష్టిస్తున్నాడని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం ఉదయం తన నివాసంలో పరిచయం లేని కొత్త వ్యక్తులు ఉండడాన్ని గమనించానని, తాను ఆఫీసుకు వెళ్లగానే, తన ఇంటి వద్ద పరిస్థితి బాగా లేదని సిబ్బంది సమాచారం అందించారని వివరించారు.
 
'మనోజ్‌కు చెందినవారుగా భావిస్తున్న 30 మంది వ్యక్తులు నా నివాసంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నా సిబ్బందిని బెదిరించారు. మంచు మనోజ్, మౌనిక ఆజ్ఞ ఆ మేరకే వారు అలా ప్రవర్తించారు. నా ఇంటిని ఆక్రమించుకోవడమే కాకుండా, నా సిబ్బందిని బెదిరించారు. 
 
వారంతా నా ఇంటిలోనే తిష్ట వేసి, నా కోసం కాచుకుని ఉన్నట్టు తెలిసింది. అందువల్ల నాకు ముప్పు ఉండడంతో, నా ఇంటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ కుట్రకు కారకులు మనోజ్, మౌనిక. ఇప్పుడు నా వయసు 78 సంవత్సరాలు. ఈ వయసులో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావడంతో నాకు తీవ్ర ముప్పు ఉందని భావిస్తున్నాను. నా ఆస్తులు కూడా ప్రమాదంలో పడ్డాయి.
 
అందుకే నా కొడుకు మనోజ్, కోడలు మౌనికపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నా నివాసం నుంచి మనోజ్, మౌనికలతో పాటు, ఇతర సంఘ విద్రోహ శక్తులను పంపించివేయండి. ముప్పు ఉన్న దృష్ట్యా నాకు తగిన భద్రత కల్పించండి... ఎలాంటి భయం లేకుండా ఇంటికి వెళ్లేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను' అంటూ మోహన్ బాబు తన లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments