Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ విద్యానికేతన్... మరో శాంతినికేతన్ అని కలాం గారు అన్నారు : మోహన్ బాబు

Webdunia
మంగళవారం, 28 జులై 2015 (17:28 IST)
దేశంలోని ఎంతోమంది యువతకు భారతరత్న కలాం గారు ఆదర్శప్రాయుడు. తన శాస్త్ర విజ్ఞానంతో మన దేశానికి ప్రపంచంలో గుర్తింపును తెచ్చారు. స్వయంకృషితో అత్యున్నత స్థానానికి ఎదిగారు. ఎంత ఎదిగినా నిరాడంబరంగా ఉండటం ఆయనకే చెల్లుతుంది. యువతను ప్రేరేపిస్తూ వారే దేశాన్ని ముందుండి నడిపించాలనేవారు.
 
ఏ అవార్డులు చేపట్టినా, పదవులు అలంకరించినా వాటికి వన్నె తెచ్చారు. అందరిలో ఆయన రగిలించిన స్ఫూర్తి మరచిపోలేం. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. 2009 మార్చి 19న శ్రీ విద్యానికేతన్‌ను ఆయన సందర్శించి ఒక ఇక్కడ వాతావరణం శాంతినికేతన్‌లా ఉంది. 
 
చాలా ప్రశాంతంగా దేవాలయంలా ఉందని అనడమే కాకుండా శ్రీ విద్యానికేతన్ వంటి విద్యా సంస్థను నిర్వహిస్తున్నందుకు నన్ను అభినందించారు. అటువంటి ఉన్నత వ్యక్తి, మేధావి మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం తీరనిలోటు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ సాయినాథుని, వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను అని అన్నారు మోహన్ బాబు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments