Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరీ బాత్రూంలోనా...? హీరోయిన్ వద్దన్నా వదల్లేదు...

హీరోయిన్లంటే అభిమానులు ఎలా వుంటారో వేరే చెప్పక్కర్లేదు. ఎగబడిపోతారు. ఎక్కడయినా ఫంక్షన్లు జరుగుతుంటే వారిని చూసేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు పరుగులు పెడుతుంటారు. ఇలాంటి ఘటనే జరిగింది. ఈ మధ్యనే దుబాయ్ లో ఓ ఫ్యాషన్ షోలో పాల

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (20:01 IST)
హీరోయిన్లంటే అభిమానులు ఎలా వుంటారో వేరే చెప్పక్కర్లేదు. ఎగబడిపోతారు. ఎక్కడయినా ఫంక్షన్లు జరుగుతుంటే వారిని చూసేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు పరుగులు పెడుతుంటారు. ఇలాంటి ఘటనే జరిగింది. ఈ మధ్యనే దుబాయ్ లో ఓ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు వెళ్లింది నటి, 2007లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటం గెలుచుకున్న ఇషా గుప్త. ఆమెకు ర్యాంప్ వాక్ అంటే వెన్నతో పెట్టిన విద్య. అందుకే ప్రముఖ కంపెనీలన్నీ ఆమెను పిలుస్తుంటాయి. 
 
అందులో భాగంగానే ఆమె దుబాయ్‌లో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్లింది. అలా వెళ్లిన ఆమె తన ర్యాంప్ వాక్ ముగించుకుని బాత్రూంకి వెళ్లింది. ఐతే ఆమె కోసం ఓ అభిమాని పరుగులుపెట్టాడు. ఆమె బాత్రూంకు వెళుతున్నా ఆమెను వెంబడించాడు. సరాసరి లేడీస్ బాత్రూంలోకి వెళ్లిపోయాడు. దాంతో షాక్ తిన్న ఇషా... ఎందుకొచ్చావ్ ఇక్కడికి అని ప్రశ్నించేసరికి... ప్లీజ్ సెల్ఫీ మేడమ్ అని బ్రతిమాలాడు. ఏంటీ బాత్రూంలోనా అని ప్రశ్నించినా వదల్లేదు. దాంతో ఆమె సెక్యూరిటీ పర్సన్స్ పిలిచి అక్కడి నుంచి అతడిని ఖాళీ చేయించింది. కేసు పెట్టినట్లయితే దుబాయ్ లో తీవ్రమైన శిక్షలుంటాయ్. కానీ తనపై అభిమానం కోసం వచ్చాడులే అని వదిలేసిందట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

కుమారుడికి క్షమాభిక్ష పెట్టుకున్న జో బైడెన్!!

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్.. డిప్యూటీ సీఎం రేసులో శ్రీకాంత్ షిండే!!

భోజనం పళ్లెంలో ఏమేం ఉండాలి? రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments