కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

దేవీ
సోమవారం, 23 జూన్ 2025 (11:23 IST)
Mitra Mandali team
బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మిత్ర మండలి'.  కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
తాజాగా 'మిత్ర మండలి' నుంచి మొదటి గీతం 'కత్తందుకో జానకి'ని నిర్మాతలు విడుదల చేశారు. ఈ గీతావిష్కరణ కార్యక్రమం శనివారం(జూన్ 21) సాయంత్రం అమలాపురంలోని కిమ్స్ కాలేజ్ లో జరిగింది.
 
రెబల్ స్టార్ కృష్ణంరాజు ఐకానిక్ డైలాగ్ 'కత్తందుకో జానకి'ని తీసుకొని, ఈ తరం మెచ్చేలా అద్భుతమైన పాటగా మలిచారు. ఆర్.ఆర్. ధృవన్ స్వరపరిచిన ఈ గీతం.. వినసొంపుగా, అందరూ సరదాగా పాడుకునేలా ఉంది. కాసర్ల శ్యామ్ మరోసారి తన కలం బలం చూపించారు. ఈ సరదా గీతాన్ని ఎంతో అందంగా, అర్థవంతంగా వ్రాశారు. ఇక రాహుల్ సిప్లిగంజ్ తన గాత్రంతో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు.
 
'మిత్ర మండలి' మొదటి గీతం 'కత్తందుకో జానకి'కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రధాన పాత్రధారులు ప్రియదర్శి, విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ల ప్రపంచాన్ని పరిచయం చేస్తూ గీతం సాగింది. తమ గురించి తాము ఉల్లాసంగా పాడుతూ.. నేటి Gen Z అలవాట్లయిన రీల్స్, రిలేషన్స్, పబ్జీ గేమింగ్ ఇలా ప్రతిదానిని ప్రస్తావిస్తూ 'కత్తందుకో జానకి' గీతం నడిచిన తీరు కట్టిపడేసింది. ఓ వైపు యువత తమ అలవాట్లను చెప్పుకుంటుంటే, మరోవైపు తల్లిదండ్రులు వారిని తరుముతూ 'కత్తందుకో జానకి' అనడం ఆకట్టుకుంది.
 
అమలాపురం కిమ్స్ కాలేజ్ లో జరిగిన 'కత్తందుకో జానకి' గీతావిష్కరణ వేడుకకు ముఖ్య అతిథిగా అమలాపురం ఎంపీ జి.ఎం. హరీష్ బాలయోగి హాజరయ్యారు. అలాగే కిమ్స్ చైర్మన్ చైతన్య రాజు, ఎండీ రవివర్మ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు బన్నీ వాస్, నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల, నటీనటులు ప్రియదర్శి, నిహారిక, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, దర్శకుడు విజయేందర్ ఎస్, సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ తదితరులు సందడి చేశారు.
 
'కత్తందుకో జానకి' గీతం యువత మెచ్చేలా ఉందని ప్రశంసించిన అతిథులు.. 'మిత్ర మండలి' సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. బాధలన్నీ మర్చిపోయి, థియేటర్లలో మనస్ఫూర్తిగా నవ్వుకునేలా 'మిత్ర మండలి' సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.
 
వెన్నెల కిషోర్, సత్య, వీటీవీ గణేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న 'మిత్ర మండలి' చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్‌గా పీకే, ఆర్ట్ డైరెక్టర్‌గా గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా శిల్పా టంగుటూరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజీవ్ కుమార్ రామా వ్యవహరిస్తున్నారు.
 
'మిత్ర మండలి' అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. ఇది ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించడానికి త్వరలోనే థియేటర్లలో అడుగుపెట్టనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడుకు వర్ష సూచన - 12 జిల్లాల్లో కుండపోత వర్షం

పెళ్లి పేరుతో నమ్మంచి వాడుకుని వదిలేశాడు.. భరించలేక ప్రాణాలు తీసుకున్న యువతి

యువతిని తాకరాని చోట తాకిన అకతాయి.. దేహశుద్ధి చేసిన ప్రజలు

మటన్ కూరలో కారం ఎక్కువైందంటూ తిట్టిన భర్త... మనస్తాపంతో నవ వధువు

చిత్తూరు నుంచి చెన్నై - బెంగుళూరుకు జస్ట్ ఓ గంటన్నర మాత్రమే జర్నీ....

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments