Webdunia - Bharat's app for daily news and videos

Install App

19న థియేటర్ లలో గ్రాండ్ రిలీజ్ అవుతున్న “మిస్సింగ్” సినిమా

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (17:37 IST)
Kiran heroine, Nikhisha Rangwala, Harsha narra, sreeni josyula
హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “మిస్సింగ్”. ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. “మిస్సింగ్” చిత్రంతో శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “మిస్సింగ్” చిత్రం  ఈనెల 19న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.
 
హీరోయిన్ నికీషా రంగ్వాలా మాట్లాడుతూ, ఈ మూవీలో మిస్ అయ్యేది నేనే. కాబట్టి ఈ నెల 19న ప్రేక్షకులు అందరూ నన్నే వెతుకుతారు అనుకుంటున్నాను. ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. మిస్సింగ్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు నా క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. అన్నారు
 
హీరో హర్షా నర్రా మాట్లాడుతూ, మా సినిమా థియేటర్ కోసమే తెరకెక్కించాం. అందుకే ఓటీటీ ఆఫర్స్ ఎన్ని వచ్చినా థియేటర్ రిలీజ్ కే మొగ్గు చూపాం. అంతా కొత్తవాళ్లం చేసిన ప్రయత్నమిది. తప్పకుండా మీకు నచ్చేలా ఉంటుంది. థియేటర్ లలో ఈనెల 19న విడుదల చేసేందుకు రెడీ అయ్యాం. థియేటర్ లోనే ఎందుకు అంటే, మిస్సింగ్ మూవీని థియేటర్ లో చూసే ఎక్సీపిరియన్స్ వేరుగా ఉంటుంది. మా సినిమాలోని విజువల్స్, సౌండింగ్, మేకింగ్ థియేటర్స్ కే కరెక్ట్. మంచి థ్రిల్లర్ మూవీ చేశాం. ఫ్యామిలీ అంతా చూసేలా సినిమా ఉంటుంది. అన్నారు.
 
దర్శకుడు శ్రీని జోస్యుల మాట్లాడుతూ, అంతా కొత్త వాళ్లం కలిసి చేసిన చిత్రమిది. కొత్త వాళ్లను ఆదరించడంలో మన ప్రేక్షకులు ముందుంటారు. మిస్సింగ్ చిత్రంతో మేము చేసిన ప్రయత్నాన్ని కూడా రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. మా మూవీలో ఎక్కడా వల్గారిటీ ఉండదు. మంచి థ్రిల్లింగ్ ఎక్సీపిరియన్స్ ఇచ్చే చిత్రమిది. మీకు నచ్చితే పది మందికి చెప్పండి. లేకుంటే మాకు చెప్పండి, లోపాలు ఉంటే కరెక్ట్ చేసుకుంటాం. వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఉండాలన్నదే మా కోరిక. ఈ నెల 19న థియేటర్ లలో మిస్సింగ్ చూసి ఆదరించండి. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments