Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిక్‌‌కు మిస్ అయినా ఇప్పుడు మిస్టర్ బచ్చన్‌తో హ్యాపీగా వున్నా

డీవీ
శనివారం, 17 ఆగస్టు 2024 (17:22 IST)
Mickey J Meyer
మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ల మాస్ మహా బ్లాక్ బస్టర్ 'మిస్టర్ బచ్చన్'.  ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్‌తో నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించి, ఘనవిజయాన్ని అందుకుని, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో ఈ మూవీకి చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించిన స్టార్ కంపోజర్ మిక్కీ జే మేయర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
 
మిస్టర్ బచ్చన్ మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది మీకు క్లాస్ నుంచి మాస్ ట్రాన్స్ ఫర్మేషనా?
-మిస్టర్ బచ్చన్ మ్యూజిక్ కి ఇంత మంచి రెస్పాన్స్ రావాడం చాలా హ్యాపీగా వుంది. సాంగ్స్ అన్ని ఆడియన్స్ చాలా నచ్చాయి. ఇదొక సర్ప్రైజ్.
 
-నేను మాస్, క్లాస్ అని అలోచించను. సాంగ్స్ అనేవి స్క్రిప్ట్ ప్రకారమే వస్తాయి. మిస్టర్ బచ్చన్ లో ఇలాంటి మాస్ సాంగ్స్ చేసే అవకాశం వచ్చింది. ఇలాంటి మాస్ సాంగ్స్ చేయడం నాకేం షాకింగ్ గా లేదు. నేను ఇలాంటి మాస్ సాంగ్స్ చేయగలనని నాకు తెలుసు. ఏదైనా మనకొచ్చిన కథని బట్టే వుంటుంది.
 
ఇందులో ఎక్కువ హిందీ సాంగ్స్ వున్నాయి కదా.. ఇది ఎవరి ఆలోచన?
-అది మొత్తం డైరెక్టర్ ఐడియా. హరీష్ గారు కిషోర్ కుమార్ బిగ్ ఫ్యాన్. నేను కూడా ఆ సాంగ్స్ విని పెరిగాను. అయితే ఆ పాటలన్నిటికి కొత్త బీట్స్, బ్యాకింగ్ యాడ్ చేసి కొంచెం యాంప్లిఫై చేశాం.  
 
నాలుగు ట్యూన్స్ వన్ వీక్ లో కంప్లీట్ చేశారని డైరెక్టర్ చెప్పారు ?
-నేను చాలా ఫాస్ట్ గా కంపోజ్ చేస్తాను. ఈ ఆల్బం కోసం హరీష్ గారు సియాటిల్ వచ్చారు. అప్పటివరకూ నేను ఎప్పుడూ మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చోలేదు. ఆయనతో కూర్చుని వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. నాలుగు రోజుల్లో ట్యూన్స్ పూర్తి చేశాం. చాలా నైస్ ఎక్స్ పీరియన్స్ ఇది.
 
మీరు అమెరికాలో వుంటారు కదా.. వర్క్ చేసే విధానం ఎలా వుంటుంది ?
-నేను బిగినింగ్ నుంచి అమెరికాలోనే వున్నాను. కథ ఫోన్ లో చెప్తారు. జూమ్ కాల్స్ కూడా వుంటాయి. కథ ని విని ట్యూన్స్ ఇస్తాను. ఏవైనా మార్పులు చేర్పులు వుంటే మళ్ళీ చేసి పంపిస్తాను. రీరికార్డింగ్ మాత్రం ఇక్కడికి వచ్చి చేస్తాను.
 
రవితేజ గారి సినిమాకి వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు రవితేజ గారితో చేసిన కిక్ సినిమా కోసం నన్ను కలిశారు. అయితే కొన్ని కారణాల వలన అది కుదరలేదు. ఆ సినిమాకి తమన్ మ్యూజిక్ చేశారు. అప్పటి నుంచి రవితేజ గారితో వర్క్ చేసే అవకాశం కోసం ఎదురుచూశాను. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ కి మ్యూజిక్ చేయడం పెర్ఫెక్ట్ టైమింగ్ అనిపించింది.    
 
హరీష్ శంకర్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-హరీష్  గారికి గ్రేట్ మ్యూజిక్ సెన్స్ వుంది. తనకి ఎలాంటి మ్యూజిక్ కావాలో క్లారిటీ వుంది. మ్యూజిక్ సెన్స్ వున్న దర్శకులతో పని చేయడం కంపోజర్ కి ఈజీగా వుంటుంది. ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్.
 
మిస్టర్ బచ్చన్ లోని ఓ పాటలో దేవిశ్రీ ప్రసాద్ గారు కనిపించడం ఎలా అనిపించింది?
-హరీష్, దేవిశ్రీ మంచి ఫ్రండ్స్. ఆ ఇష్టంతో ఆయన చిన్న క్యామియోలో కనిపించారని అనుకుంటాను. దేవిని స్క్రీన్ పై చూడటం చాలా హ్యాపీగా అనిపించింది.  
 
కంపోజర్ గా లాంగ్ కెరీర్ ని చూశారు కదా..మీరు అనుకున్న స్టేజ్ కి చేరుకున్నారనే హ్యాపీనెస్ ఉందా?
-డెఫనెట్లీ. నేను ఆనుకున్న దాని కంటే ఎక్కువ సక్సెస్ చూశాను. ఇది అమెజింగ్ జర్నీ. ఆడియన్స్ గుర్తుపెట్టుకుని పాడుకునే హిట్స్ ఇచ్చాననే ఆనందం వుంది. మ్యూజిక్ స్టార్ట్ చేసినప్పుడు తెలుగులో నాకు ఒక్క పదం తెలీదు. కానీ మన ఇండస్ట్రీ చాలా గొప్పది. ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ముందుంటుంది. ఎవరికైన ఇక్కడ అవకాశాలు వుంటాయి. నా జర్నీ విషయంలో చాలా హ్యాపీగా వుంది. ఇది ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను.
 
మెలోడీ, మాస్.. ఈ రెండిట్లో ఎక్కువ ఏది ఎంజాయ్ చేస్తారు?
-ఇప్పటివరకూ మెలోడీ ఎక్కువ ఎంజాయ్ చేశాను. అయితే మిస్టర్ బచ్చన్ తో డిఫరెంట్ చాప్టర్ ఓపెన్ అయ్యింది. ఇలాంటి మరిన్ని మాస్ నెంబర్స్ చేయాలని వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

రూ. 287 కోట్ల లాటరీ, డబ్బు అందుకునేలోపుగా అతడిని వెంటాడిన మృత్యువు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments