Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మిస్టర్ కూల్" నా రోల్‌ మోడల్... సాయం చేసే గుణమెక్కువ : మిస్ దివా

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (16:52 IST)
మిస్ దివా 2018 రన్నరప్‌గా రోషిణి నిలిచారు. ఆ తర్వాత ఆమెను మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే తనకు చెప్పలేనంత ఇష్టమని చెప్పుకొచ్చింది.
 
ముంబై వేదికగా ఆదివారం రాత్రి మిస్ విదా దివా పోటీలు జరిగాయి. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా బాలీవుడ్ నటులు శిల్పా శెట్టి, మలైకా అరోరా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లు వ్యవహరించారు. ఈ సందర్భంగా 'నీ రోల్ మోడల్ ఎవరు?.. వారిని ఎందుకు ఎంచుకున్నావ్?' అంటూ రన్నరప్ రోషిణిని మలైకా ప్రశ్నించింది.
 
దీనిపై ఆమె ఏమాత్రం తడుముకోకుండా ధోనీ పేరు చెప్పింది. ఆటలో అతడు చాలా కూల్‌గా ఉంటాడని, ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటాడని, సహచరులను ఎంతగానో ప్రోత్సహిస్తాడని, అతడికి సాయం చేసే గుణం ఎక్కువని చెప్పుకొచ్చింది. 
 
నిజానికి ఆమె ఎవరైన మహిళ పేరు చెబుతుందని భావించారు. కానీ, ధోనీ పేరు చెప్పడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఫైనల్‌లో రోషిణి మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments