Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెగ్యులర్ ఫార్మెట్ ని మీటర్ బ్రేక్ చేస్తుంది : దర్శకుడు రమేష్ కడూరి

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (19:26 IST)
Director Ramesh Kaduri, Kiran Abbavaram
మీటర్ అంటే కొలత. ఇందులో హీరోయిజానికి సంబధించిన ఒక కొలత.. ఎమోషన్, ప్రేమకు సంబధించిన ఒక కొలత. కిరణ్ అబ్బవరం ఇంతకుముందు చేసిన సినిమాలన్నిటి కంటే ఇది డిఫరెంట్ గా వుంటుంది. తండ్రి కొడుకుల మధ్య మంచి ఎమోషన్ వుండే కథ. సినిమా అంతా చాలా ఎంటర్ టైనర్ గా వుంటుంది అని దర్శకుడు రమేష్ కడూరి అన్నారు. 
 
 మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్  ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు. అతుల్య రవి కథానాయికగా నటిస్తోంది. ఔట్ అండ్ ఔట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7న సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో దర్శకుడు రమేష్ కడూరి మీటర్ విశేషాలని విలేఖరుల సమావేశంలో పంచుకున్నారు.  
 
మీ నేపధ్యం గురించి చెప్పండి ?
మాది విజయనగరం జిల్లా గరివిడి మండలం. సినిమాలపై ఇష్టంతో దర్శకుడు కావాలని పరిశ్రమలోకి వచ్చాను. బాబీ గారు , గోపీచంద్ మలినేని గారి దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశాను. ఇప్పుడు మీటర్ తో దర్శకుడిగా పరిచయమౌతున్నాను.
 
మీటర్  ప్రాజెక్ట్ ఎలా ఓకే అయ్యింది ?
రచయిత శ్రీకాంత్ విస్సా మైత్రీ మూవీ మేకర్స్ కి రిఫర్ చేశారు. తర్వాత బాబీ గారు, గోపీచంద్ మలినేని గారి ప్రోత్సాహంతో ఈజీ అయ్యిది. కరోనా లాక్ డౌన్ తర్వాత ప్రాజెక్ట్ ఓకే అయ్యింది.
 
కిరణ్ సీరియస్ పోలీస్ లా కనిపిస్తారా ?
ఇందులో తన పాత్ర ఒక డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్ గా వుంటుంది. తను సీరియస్ కాప్ గా సెకండ్ హాఫ్ లో ఓ పది నిమిషాలు వుంటుంది. ఆ పది నిముషాలు థియేటర్ లో రఫ్ఫాడించేస్తాడు. మిగతా అంతా ఒక మంచి ఎంటర్ టైనర్ గా మంచి ఫన్ తో వెళుతుంది.
 
పక్కా కొలతలు పెట్టుకొని కమర్షియల్ ఫార్మెట్ లో చేసినట్లుగా వున్నారు ?
కావాలని పెట్టుకున్న కొలతలు కాదు. ఈ కథ అలా కుదిరింది. అలా అని రెగ్యులర్ ఒక పాట ఫైటు అన్నట్టుగా వుండదు. రెగ్యులర్ ఫార్మెట్ ని బ్రేక్ చేస్తుంది. డిఫరెంట్ గా ఉంటూనే కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వుంటుంది.
 
కిరణ్ అబ్బవరం ఇంత మాస్ పాత్రకు ఎలా సూట్ అవుతారనే ఆలోచన రాలేదా ?
మన దగ్గర ఏముందో దానితోనే గెలవాలి. ఈ కథ తో ఇద్దరు ముగ్గురు హీరోలని సంప్రదించాను. అయితే అప్పటికే వాళ్ళు చేయాల్సిన ప్రాజెక్ట్ లు వుండటం , ఇంకొన్ని కారణాల వలన కుదరలేదు. అలా అని వుండిపొతే నా కెరీర్ ఆగిపోతుంది. అందుకే ఎవరిని పట్టుకున్న మనం అనుకున్నట్లు చూపించాలని నిర్ణయించుకున్నాను.  అప్పడే ఎస్ఆర్ కళ్యాణ మండపం తో వచ్చాడు కిరణ్. నిర్మాతలు కూడా ఆ సినిమాని చూశారు. ఈ కథ అతనికి పడితే బావుంటుందని ఫీలయ్యారు. వెళ్లి కథ చెబితే ఓకే చేశారు. ఓకే చేసిన తర్వాత ఇంక అలోచించలేదు.
 
అతుల్య రవిని ఎలా ఎంపిక చేశారు ?
తను తమిళ్ లో చేసిన రెండు సినిమాలు చూశాను. తన నటన బావుంటుంది. తనకి తెలుగు కూడా రావడంతో నాకు ఇంకా ప్లస్ అయ్యింది.
 
సాయి కార్తిక్ మ్యూజిక్ గురించి ?
కమర్షియల్ టోన్ తెలిసిన సంగీత దర్శకుడు సాయి కార్తిక్. తన చేసిన పటాస్ సినిమా నాకు చాలా ఇష్టం. ఈ కథకు మా పరిధిలో సరైన ఎంపిక సాయి కార్తిక్. నెక్స్ట్ లెవల్ మ్యూజిక్ ఇచ్చాడు.
 
అనుకున్నదాని కంటే ఎక్కువ బడ్జెట్ అయ్యిందని విన్నాం ?
సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే బడ్జెట్ కి వెనుకడుగు వేయని నిర్మాతలు దొరకడం నా అదృష్టం. సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే మనం అడగకముందే ఇస్తారు. చెర్రీగారికి, రవి గారికి, నవీన్ గారి లైఫ్ లాంగ్ రుణపడి వుంటాను. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments