Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మెర్సల్'' వివాదం.. పైరసీ కాపీని చూశావా? పెద్దమనిషిగా వుండి సిగ్గులేదా?: విశాల్ ప్రశ్న

కోలీవుడ్ హీరో విజయ్ త్రిపాత్రాభినేయం చేసిన 'మెర్సల్' దీపావళి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మెర్సల్ సినిమాలో జీఎస్టీ పై డైలాగు

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2017 (11:08 IST)
కోలీవుడ్ హీరో విజయ్ త్రిపాత్రాభినేయం చేసిన 'మెర్సల్' దీపావళి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మెర్సల్ సినిమాలో జీఎస్టీ పై డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ తమిళనాడు బీజేపీ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. 
 
సింగపూర్ కన్నా ఎక్కువగా భారత్ లో 28 శాతం జీఎస్టీ ఉన్నప్పటికీ ఇక్కడ ఉచిత వైద్య సదుపాయాలు లేవని విజయ్ చెప్పిన డైలాగులపై వివాదం రేగింది. ఈ డైలాగులపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హెచ్.రాజా మాట్లాడుతూ, తాను 'మెర్సెల్' పైరసీ కాపీని చూశానని... సినిమాలోని డైలాగులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. 
 
అయితే రాజా వ్యాఖ్యలపై తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి విశాల్ మండిపడ్డారు. ఒక జాతీయ నేత స్థాయిలో ఉండి పైరసీ సినిమా చూశానని చెప్పడం అత్యంత దారుణమని ఫైర్ అయ్యారు. సంఘంలో పెద్దమనిషిగా వుంటూ, పైరసీ సినిమా చూశానని చెప్పేందుకు సిగ్గు లేదా? అంటూ ప్రశ్నించాడు. ఇలాంటి పని చేసినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని... పైరసీ లింకులను తొలగించడానికి ప్రభుత్వానికి సహకరించాలని డిమాండ్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో మరో జీబీఎస్ మరణం... మహమ్మారి కాదు.. కాళ్లలో తిమ్మిరి వస్తే?

17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గదికి రప్పించుకుని.. నగ్న ఫోటోలు తీసి?

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ.. ప్రమాణ స్వీకారంకు సర్వం సిద్ధం

వంట విషయంలో భర్తతో గొడవ.. చెరువులో చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య (video)

Rooster: మూడు గంటలకు కోడి కూస్తోంది.. నిద్ర పట్టట్లేదు.. ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments