Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మేము' వాయిదా పడిందా...?!

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2015 (19:57 IST)
హీరో సూర్య తన సొంత బ్యానర్‌ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ బ్యానర్‌లో రూపొందిన 'మాస్‌' సినిమా కొద్ది నెలల క్రితం విడుదలై సూర్యకు మంచి పేరే తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత సూర్య తాజాగా నిర్మించిన 'పసంగ 2' అనే సినిమా తమిళనాట మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ఇక సూర్యకు తెలుగులోనూ ఉన్న మార్కెట్‌ దృష్ట్యా ఈ సినిమాను 'మేము' పేరుతో తెలుగులోనూ తీసుకువస్తున్నారు.
 
పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను డిసెంబర్‌ 4న పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు సూర్య టీమ్‌ సన్నాహాలు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాను డిసెంబర్‌ 4వ తేదీ నుండి డిసెంబర్‌ 24కు వాయిదా వేశారు. నవంబర్‌ నెలలోనే రావాల్సిన సినిమా ఒకసారి వాయిదా పడి ఇప్పుడు మరోసారి వాయిదా పడడం ఆసక్తికరంగా మారింది. సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా క్రిస్‌మస్‌, కొత్త సంవత్సరం సీజన్‌ను దృష్టిలో పెట్టుకొనే డిసెంబర్‌ నెలాఖరుకు వెళ్ళినట్లు తెలుస్తోంది. 
 
సూర్య, అమలాపాల్‌, బింధు మాధవి పలువురు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా మానసిక వ్యాధితో బాధపడే చిన్నారుల చుట్టూ తిరుగుతుంది. పలువురు బాల నటులు మెయిన్‌ లీడ్స్‌లో నటించిన ఈ సినిమాలో సూర్య పాత్రకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాను జూలకంటి మధుసూదన్‌ రెడ్డి విడుదల చేస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments