Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంగా ఓణీలో పల్లెటూరి పిల్ల పోజులిస్తున్న ఎఫ్2 బేబీ

Webdunia
శనివారం, 9 నవంబరు 2019 (18:52 IST)
నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది బబ్లీ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జా. ఆ తరువాత మారుతీ దర్శకత్వంలో శర్వానంద్ సరసన చేసిన మహానుభావుడు చిత్రం కూడా హిట్ కావడంతో వరుస అవకాశాలు పట్టేసింది. ఐతే ఆ తరువాత మెహ్రీన్ నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. 
 
ఈ ఏడాది మాత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌తో మెహ్రీన్ ప్రారంభించింది. వెంకటేష్, వరుణ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఎఫ్ 2 బంపర్ హిట్ అందుకుంది. కాగా ఆమె ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సరసన ఎంతమంచివాడవురా చిత్రంలో నటిస్తుంది. 
 
పల్లెటూరి నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా దర్శకుడు సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీ ఆన్ లొకేషన్స్ స్టిల్స్ కొన్ని బయటకి వచ్చాయి. వాటిలో మెహ్రీన్ లంగా ఓణీలో పక్కా పల్లెటూరి అమాయకపు అమ్మాయిగా క్యూట్‌గా ఉంది. సీనియర్ నటి సుహాసినితో కలిసి వున్న మెహ్రీన్ లుక్స్ చూస్తుంటే ఆమె పాత్ర ఈ మూవీలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఎంత మంచివాడవురా చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments