Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకీమామ గురించి కామెంట్ చేసిన‌ మెగాస్టార్ . ఇంత‌కీ ఏంట‌ది..?

Webdunia
శుక్రవారం, 20 డిశెంబరు 2019 (11:03 IST)
విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ స‌మ్రాట్ నాగ‌చైత‌న్యల క్రేజీ కాంబినేష‌న్ లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీమామ‌. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మించాయి. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా డిసెంబ‌ర్ 13న విడుద‌లైన ఈ చిత్రం హిట్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది.
 
రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ తో స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోన్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేకంగా వీక్షించారు. షో అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... మా ఫ్యామిలీ అంతా క‌లిసి వెంకీమామ‌ సినిమా చూశాం. అంద‌రికీ బాగా న‌చ్చింది. అంద‌రూ ఎంజాయ్ చేశాం. సినిమా అంత బాగా న‌చ్చ‌డానికి కార‌ణం మిత్రుడు వెంక‌టేష్.  త‌న స్టైల్ ఆఫ్ కామెడీ, ఎమోష‌న్స్‌తో అందరినీ మెప్పిస్తున్నారు. చాలా కాలం త‌ర్వాత యాక్ష‌న్ స‌న్నివేశాల్లోనూ వావ్ అనిపించాడు.
 
అద్భుతంగా న‌టించి ఈ స‌క్సెస్‌కు ప్ర‌ధాన కార‌ణంగా నిలిచాడు. త‌న‌ను మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మామ‌కు త‌గ్గ అల్లుడిగా నాగ చైత‌న్య మెచ్యూర్డ్ పెర్ఫామెన్స్ చేశాడు. ఈ స‌క్సెస్‌లో త‌ను కూడా భాగ‌స్వామిగా మారాడు. డైరెక్ట‌ర్ బాబీ త‌న స్టైల్ ఆఫ్ టేకింగ్, స్క్రీన్‌ప్లేతో ప‌ట్టు స‌డ‌ల‌కుండా బ్యూటీఫుల్‌గా సినిమాను తెర‌కెక్కించి శ‌భాష్ అనిపించాడు. ఈ సినిమాలో స‌క్సెస్ అయిన సంద‌ర్భంలో చిత్ర‌యూనిట్‌కు నా అభినంద‌న‌లు అన్నారు.

సంబంధిత వార్తలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments