Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవి ఓటీటీలోకి వస్తున్నారా..? (video)

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (12:11 IST)
అవును.. ఇది నిజం! కరోనా వచ్చి థియేటర్లు అన్నీ మూసేసారు. దీంతో కొత్త సినిమాలు రిలీజ్ ఆగిపోయాయి. ఇక ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ చేస్తారనే నమ్మకం లేకపోవడం. ఒకవేళ థియేటర్లు ఓపెన్ చేసినా ప్రజలు సినిమా చూడడానికి వచ్చే పరిస్థితి లేదు. దీంతో రిలీజ్‌కి రెడీగా ఉన్న సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
 
భవిష్యత్‌లో ఓటీటీ అనేది మరింత విస్తృతంగా మారనుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకనే ఆహాను మరింతగా విస్తృతపరిచేందుకు అల్లు అరవింద్ పక్కా ప్లాన్ రెడీ చేసారు.  స్వయంగా అల్లు అరవిందే ఆహా ప్లాన్ ఏంటనేది మీడియాకు తెలియచేసారు. ఇంతకీ అల్లు అరవింద్ ఏం చెప్పారంటే.. చిరంజీవితో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నామ‌ని, 42 షోలు రాబోయే రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయ‌ని అల్లు అర‌వింద్ చెప్పారు.
 
రెండు మూడేళ్ల‌లో పెద్దపెద్ద స్టార్స్ అంతా ఓటీటీలోకి వ‌చ్చేస్తారు. చిరంజీవితో ఓ వెబ్ సిరీస్ కోసం సంప్ర‌దిస్తున్నాం అని చెప్పారు. క‌థ న‌చ్చితే చాలు. ఆయ‌న న‌టిస్తారు. అందులో ఎలాండి డౌట్ లేదన్నారు. అల్లు అరవింద్ మాటలను బట్టి ఈపాటికే చిరంజీవితో ఓకే అనిపించుకున్నారనిపిస్తుంది. ఇంకా ఏం చెప్పారంటే... ఆహా నుంచి 42 షోలు రాబోతున్నాయి. 
 
వ‌చ్చే యేడాది జూన్ నాటికి… దాదాపు అన్నీ షోస్ స్టార్ట్ అవుతాయి. ఎక్కువ‌గా వీకెండ్ వ‌చ్చేలా షోలు ప్లాన్ చేస్తున్నాం. కొన్ని షోస్‌ల‌లో స్టార్స్ క‌నిపిస్తారు” అని ఆహా ప్లాన్ ఏంటో వివరించారు. చిరు ఓటీటీలోకి వస్తే... ఏ స్ధాయి విజయాన్ని సాధిస్తారో చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments