Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు పాటల షూటింగ్ కోసం యూరప్ వెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (16:27 IST)
Chiranjeevi, Shruti Haasan
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వాల్తేరు వీరయ్య' అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది.  'వాల్తేరు వీరయ్య' జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని మేకర్స్ నిన్ననే అధికారికంగా ప్రకటించారు.
 
'వాల్తేరు వీరయ్య' షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా ఈ చిత్రంలో రెండు పాటల చిత్రీకరణ కోసం మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ శ్రుతి హాసన్ తో పాటు చిత్ర యూనిట్ యూరప్ వెళ్ళింది. అక్కడ వండర్ ఫుల్ లోకేషన్స్ లో రెండు పాటలని చిత్రీకరించనున్నారు.
 
ఇప్పటికే వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగల్ 'బాస్ పార్టీ'..  పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా మారడంతో సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లు బ్లాక్‌బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి.  
 
ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.  
 
మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని,  వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments