Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవి, రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతికి ఫిక్స్

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2022 (19:21 IST)
Waltheru Veeraiya
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వాల్తేరు వీరయ్య' అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌ లో ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా సంక్రాంతికి రానున్న సంగతి తెలిసిందే.  'వాల్తేరు వీరయ్య' జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
 
చిరంజీవి సంక్రాంతికి చాలా బ్లాక్‌బస్టర్‌ లను అందించారు. పండుగకు థియేటర్లలో మాస్ పార్టీని అందించడానికి మరొక బ్లాక్‌బస్టర్ లోడ్ అవుతోంది. విడుదల తేదీ పోస్టర్‌ లో చిరంజీవి వింటేజ్ మాస్ అవతార్‌ లో లుంగీ, వైబ్రెంట్ షర్ట్‌, హెడ్‌ బ్యాండ్‌ తో  కనిపించారు. చేతిలో బల్లెం లాంటి ఆయుధం పట్టుకొని వర్షంలో సముద్రంలో పడవ నడుపుతూ పవర్ ఫుల్ గా కనిపించారు చిరంజీవి. ఈ పోస్టర్ యే పూనకాలు తెప్పించేలా వుంది.
 
ఫస్ట్ సింగల్ బాస్ పార్టీ..  పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌ గా మారడంతో సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లు బ్లాక్‌బస్టర్ నోట్‌ లో ప్రారంభమయ్యాయి. బాస్ పార్టీ డీఎస్పీ స్టైల్‌ లో పూర్తి మసాలా నంబర్. చిరంజీవి డ్యాన్స్‌లు చూడటానికి ట్రీట్‌ గా వున్నాయి. ఊర్వశి రౌతేలా చిరంజీవి సరసన అలరించింది.
ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. 
 
 మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని,  వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత. ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా , నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌ గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.
ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌ లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments