Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ మ్యాప్‌లో చిరంజీవి ముఖచిత్రం.. ఎలా సాధ్యం?

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2023 (08:56 IST)
గూగుల్ మ్యాప్స్‌లో మెగాస్టార్ చిరంజీవి ముఖ చిత్రం ఆవిష్కృతమైంది. ఈ చిత్రాన్ని ఆయన ఫ్యాన్స్ గీసి.. తమ అభమానాన్ని చాటుకున్నారు. ఇపుడు గూగుల్‌కెక్కిన అభిమానం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగర గూగుల్ మ్యాపై మెగాస్టార్ చిత్రాన్ని గీసేందుకు మెగా అభిమానులు కొందరు ఆయన ముఖాకృతిని పోలిన రూట్ మ్యాప్‌ను ఎంచుకున్నారు. 
 
ఇందుకోసం మొత్తం 800 కిలోమీటర్ల మేర చెక్ పాయింట్స్ పెట్టుకుని అనేక మంది వివిధ వాహనాల్లో గూగుల్ నావిగేషన్ ఆధారంగా ఆయా మార్గాల్లో ప్రయాణించారు. వారు ప్రయాణించిన రూట్లన్న కలపగా గూగుల్ మ్యాప్ పై అద్భుతమైన మెగాస్టార్ చిరంజీవి ముఖచిత్రం ఆవిష్కృతమైంది. 
 
తమ ప్లాన్ సక్సెస్ అయ్యేందుకు వారు ఏకంగా 15 రోజుల పాటు శ్రమించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన మరీ పక్కాగా ప్లాన్ చేసిన అభిమానులు మెగాస్టార్‌కు అద్భుతమైన బహుమతిని ఇస్తూ తమ అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు.
 
ఇదిలావుంటే, మెగాస్టార్ చిరంజీవి నటించి "భోళాశంకర్" చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దీంతో సినిమా థియేటర్ల వద్ద మెగా అభిమానుల సంబరాలు మిన్నంటాయి. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ చెల్లిగాను, తమన్నా హీరోయిన్‌గా నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

అద్దె విషయంలో జగడం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై యువకుడు డ్యాన్స్

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments