Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మెగా 150 గేమ్"ను విడుద‌ల చేసిన వి.వి.వినాయ‌క్‌ - దిల్‌రాజు

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబ‌ర్ 150' బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న సంద‌ర్భంలో మెగాభిమానులు ఎం యాప్ సోర్స్ డెవ‌ల‌ప్మెంట్ అనే కంపెనీ స్టార్ట్ చేసిన స‌తీష్ బాబు ముత్యాల‌, ప్ర‌సా

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (12:29 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబ‌ర్ 150' బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న సంద‌ర్భంలో మెగాభిమానులు ఎం యాప్ సోర్స్ డెవ‌ల‌ప్మెంట్ అనే కంపెనీ స్టార్ట్ చేసిన స‌తీష్ బాబు ముత్యాల‌, ప్ర‌సాద్ బొలిశెట్టి, పవ‌న్ కొర్ల‌పాటి, శేషు లొశెట్టి `మెగా 150` గేమ్‌ను ప్లాన్ చేశారు. చిరంజీవి న‌టించిన 150 సినిమాల‌తో ఈ గేమ్‌ను త‌యారు చేశారు. 14 లెవ‌ల్స్‌లో ఉండే ఈ మొత్తం గేమ్‌ను రెండు వాల్యూమ్స్‌లో విడుద‌ల చేస్తున్నారు. మొద‌టి వాల్యూమ్‌లో 110 సినిమాల‌తో గేమ్ ఉంటే, రెండో వాల్యూమ్‌లో 40 సినిమాలతో గేమ్‌ను రూప క‌ల్ప‌న చేశారు. 
 
వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ.. 'మెగాభిమానుంలంద‌రూ క‌లిసి చేసిన మెగా 150 గేమ్ సూప‌ర్ సక్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. మంచి క్వాలిటీతో రూపొందిన ఈ గేమ్‌ను పిల్ల‌లంద‌రూ ఎంజాయ్ చేస్తార‌ని భావిస్తున్నాను' అన్నారు. అనంతరం నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ... మెగాస్టార్ చిరంజీవిపై అభిమానంతో ఆయ‌న అభిమానులంద‌రూ క‌లిసి చేసిన ఈ మెగా 150 గేమ్ పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఈ గేమ్‌ను త‌యారు చేసిన అంద‌రికీ ఆల్ ది బెస్ట్' అన్నారు. 
 
ఎం.యాప్ సోర్స్ డెవ‌ల‌ప్మెంట్ ప్ర‌తినిధులు స‌తీష్ బాబు ముత్యాల‌, ప్ర‌సాద్ బొలిశెట్టి, పవ‌న్ కొర్ల‌పాటి, శేషు లొశెట్టి మాట్లాడుతూ.. 'చిన్న‌ప్ప‌ట్నుంచి మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూస్తూ ఆయ‌న‌ను అభిమానిస్తూ పెరిగాం. కొత్త‌గా కంపెనీ స్టార్ట్ చేసిన‌ప్పుడు చిరంజీవిపై ఇలాంటి గేమ్ చేయాల‌ని ప్లాన్ చేశాం. చిరంజీవి 150 సినిమాల్లో ప్ర‌తి ఒక సినిమాను అంద‌రికీ తెలియ‌జేయాల‌నే ఉద్దేశంతో గేమ్ ప్లాన్ చేశాం. 14 లెవ‌ల్స్‌గా 150 సినిమాల‌ను దృశ్య రూప‌కంలోకి తీసుకొచ్చాం. చిరంజీవి 110 సినిమాల‌ను ఒక వాల్యూమ్ క్రింద‌, మిగిలిన 40 సినిమాల‌ను మ‌రో వాల్యూమ్ క్రింద క్రియేట్ చేశాం. ఈ గేమ్ అంద‌రికీ నచ్చుతుంద‌ని భావిస్తున్నాం' అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments